ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులిచ్చారు. వాళ్ల పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రులకు ర్యాంకులిచ్చారు. ఈ ర్యాంకుల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది.
ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు లాస్ట్ ర్యాంకు వచ్చింది. సోమవారం క్యాబినెట్ భేటీలో మంత్రులకు ఈ ర్యాంకుల వివరాలను సిఎం వివరించారు. ఇక ఇతర మంత్రుల ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. రెండో ర్యాంకు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు మూడు, నాలుగో ర్యాంకు కామినేని శ్రీనివాసరావు, ఐదో ర్యాంకు పరిటాల సునీత, రావెల కిశోర్ బాబు ఆరో ర్యాంకు, ఏడో ర్యాంకు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు ఎనిమిదో ర్యాంకు, కొల్లు రవీంద్ర తొమ్మిదో ర్యాంకు, పదో ర్యాంకు అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డికి పదకొండో ర్యాంకు, మృణాళినికి పదమూడు, చివరిగా పి. నారాయణకు 18 ర్యాంకు ఇచ్చారు.
ఈ ర్యాంకుల బాగోతం వెనుక భవిష్యత్ లో మంత్రివర్గంలో మార్పులు చేసేందుకే అని పార్టీలో గుగుసలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు, గంటా వంటి వారిని తప్పించేందుకు ఈ ర్యాంకులు ప్రకటించినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.