Sunday, April 28, 2024
- Advertisement -

TDP:ఆ మాజీ మంత్రికి నోటీసులు!

- Advertisement -

టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు, లోకేష్ అవినీతి కేసుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇక టీడీపీ నేతల వంతు వచ్చేసింది. ఇప్పటికే అచ్చెన్నాయుడును పలు కేసుల్లో చేర్చిన సీఐడీ తాజాగా మాజీ మంత్రి నారాయణను విచారించనుంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణకు వాట్సాప్‌ ద్వారా నోటీసులు అందించారు ఏపీ సీఐడీ అధికారులు. అక్టోబర్ 4న విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇక అదే రోజు లోకేష్‌ కూడా సీఐడీ అధికారుల విచారణకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరిని కలిపి ఒకేసారి విచారిస్తారా లేదా వేర్వేరుగా విచారిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ ఉన్నారు. గతంలో ఇదే కేసులో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు నారాయణ. అయితే తాజాగా ఆయనకు నోటీసులు ఇవ్వడంతో టీడీపీ నేతల కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు అరెస్ట్ కాగా నారా లోకేష్‌ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా సీఐడీ చేర్చింది. దీంతో పాటు మరిన్ని కేసుల్లో చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా సీఐడీ సూచించడంతో టీడీపీ ప్రధాన నేతలకు మరిన్ని చిక్కులు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -