ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 చంద్రుడిపై అడుగు పెట్టే ముందు అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోకి చేరిన అనంతరం సాంకేతిక లోపాలు తలెత్తి విక్రమ్ ల్యాండర్ తో ఇస్రో సంబంధాలు తెగిపోయాయి. విక్రమ ల్యాండర్‌తో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.
ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి.ఇస్రో ఛైర్మన్‌కు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఎలాంటి ఖాతాలు లేవని నిన్ననే క్లారిటీ ఇచ్చింది ఇస్రో. విక్రమ ల్యాండర్ ఉనికిని ఇస్రో గుర్తించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్రో కూడా వీటిని ధృవీకరించింది. చంద్రయాన్‌కు సంబంధించిన ఏ అధికారిక సమాచారమైన ఇస్రో ప్రకటిస్తుందని.. ఇస్రో సోషల్ మీడియాలోని అన్ని ఫ్లామ్‌ఫామ్‌ల్లో ఉందని తెలిపింది.
ల్యాండర్‌ను ఆర్బిటర్ గుర్తించిందంటూ మంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది.చంద్రయాన్-2లో ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది. కానీ ఇంకా దాంతో కమ్యూనికేషన్ మాత్రం జరగలేదు. ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని’ ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.
సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది.చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించింది. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ తో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించిన తర్వాత మరోసారి చంద్రుడి మీద దించే అవకాశం ఉంది.