Sunday, May 5, 2024
- Advertisement -

విక్రమ్ ల్యాండ్ ర్ ఆచూకి పై నాసా ఏమందంటే…?

- Advertisement -

చంద్రుడిపైకి మన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా పంపించిన విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకిపై పెట్టుకున్న చివరి ఆశలు అడియాశలయ్యాయి. ల్యాండ్ ను గుర్తిచేందుకు ఇస్రోతో పాటు నాసా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. చివరకు నాసా కూడా విక్రమ్ ల్యాండర్ పై చేతులెత్తేసింది.

చంద్రయాన్‌-2లో భాగంగా భారత్‌ పంపిన వ్యోమనౌక చివరి నిమిషం వరకు చక్కగా పనిచేసినా ఆఖరిలో ఫోర్స్‌ ల్యాండింగ్‌ జరిగి సమాచార సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. సిగ్నల్స్ పునరుద్దరణపై ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ల్యాండ్ తో సంబంధాలకోసం నాసా కూడా రంగంలోకి దిగింది. దీంతో విక్రమ్ జాడ తెలుస్తుందని అందరూ అనుకున్నారు. కాని చివరకు నిరాశె మిగిలింది.

ఇప్పటికే విక్రమ్ తో సిగ్నలస్ కోసం అనేక ప్రయత్నాలు చేసిన నాసా కూడా విక్రమ్ జాడను కనిపెట్టలేకపోయింది.తాజాగా నాసా ఈ రోజు చంద్ర‌యాన్ 2కు సంబంధించిన కీల‌క ఫోటోల‌ను విడుద‌ల చేసింది. నాసాకు చెందిన లునార్ రికనైజాన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్ఆర్వోసీ) చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. ఈ ఫోటోల్లో ఎక్కడా విక్రమ్ జాడ కనిపించలేదు.

చంద్రయాన్-2 నుంచి వేరయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్ ల్యాండ్ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్ ఫొటోలను నాసా విడుదల చేసింది. విక్రమ్ ల్యాండ్ కావాల్సిన నిర్ధారిత ప్రదేశాన్ని ఎల్ఆర్వోసీ తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై 150 కిలోమీటర్ల పరిధి మేర చిత్రీక‌రించింది.

ఈ చిత్రాల్లో ల్యాండర్‌ను గుర్తించలేకపోయామని నాసా ప్రకటించింది. చిత్రాల్లో పలుచోట్ల చీకటి బిలాలు ఉన్నాయని, బహుశా ఆ నీడ ప్రాంతంలో ల్యాండర్‌ ఉండి ఉండవచ్చునని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్ కూలిన చోట వెలుతురు లేదు కాబట్టి… అక్టోబర్‌లో మళ్లీ సూర్యకాంతి పడినప్పుడు… LRO ద్వారా వెతికిస్తామని నాసా తెలిపింది. దీన్ని బట్టి చూస్తె విక్రమ్ ల్యాండర్ పై ఆశలు వదులుకోవడం మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -