Monday, April 29, 2024
- Advertisement -

ముఖ్యమంత్రి బంధువు ఆత్మహత్యా యత్నం..!

- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప రాజకీయ సలహాదారు, బంధువు ఎన్​ఆర్​ సంతోశ్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు తీసుకొని బలవన్మరణానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. బెంగళూరు డాలర్స్​ కాలనీలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న సంతోశ్​ను.. కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలిసిన యడియూరప్ప.. సంతోశ్​ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. సంతోశ్​ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు సీఎం.యడియూరప్ప వ్యక్తిగత సహాయకునిగా కొంతకాలం పనిచేసిన సంతోశ్.​. ఈ ఏడాది మే నుంచి రాజకీయ సలహాదారునిగా నియమితుడయ్యారు.

అయితే.. ముఖ్యమంత్రి అంతర్గత వర్గాల్లోని కొందరితో విబేధాల కారణంగా.. సంతోశ్​ తన పదవికి రాజీనామా చేయొచ్చనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సంతోశ్​ ఆత్మహత్యాయత్నం చేసుకోడవం గమనార్హం.

లండన్ లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్

శబరిమలలో కరోనా.. అందరూ హడల్..?

మమతా బెనర్జీ కి షాక్.. సీనియర్ నేత రాజీనామా..!

మరోసారి ముఫ్తీ గృహ నిర్బంధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -