Friday, April 19, 2024
- Advertisement -

మరోసారి ముఫ్తీ గృహ నిర్బంధం..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం తనను, తన కుమార్తె ఇల్తీజాను మరోసారి గృహ నిర్బంధం చేసిందని ఆరోపించారు పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. పుల్వామాలోని వహీద్​ పర్రా​ కుటుంబాన్ని కలిసేందుకు.. రెండురోజులుగా తమకు అనుమతినివ్వడం లేదని అన్నారు. వహీద్​ పర్రాను నిరాధార ఆరోపణలతో ఎన్​ఐఏ అరెస్టు చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.

వహీద్ పర్రా పీడీపీ నేత. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ముఫ్తీ విజయానికి సహకరించాలని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థతో చర్చలు జరపారన్న ఆరోపణలపై పర్రాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

ముఫ్తీ నిర్బంధంపై జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం, నేషనల్​ కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు ఒమర్​ అబ్దుల్లా స్పందించారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం తమ అధీనంలో ఉంచుకుంటోందని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థ జోక్యం ఏ మాత్రం లేకుండా తమ ఇష్టానుసారం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

టీకా తీసుకునే ముందు జాగ్రత్త..!

సుప్రీం కోర్టు సెలవులు ఇవే..!

నేపాల్ కీ టీకా ఇచ్చిన భారత్..?

దేశ మాజీ ప్రధాని మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -