శబరిమలలో కరోనా.. అందరూ హడల్..?

- Advertisement -

కఠిన ఆంక్షల మధ్య తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయంలో కరోనా కలవరం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 39 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైరస్​ బారిన పడినవారిలో భక్తులు సహా పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.


వివిధ శాఖలకు చెందిన 27 మంది ఉద్యోగులకు పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు తెలిపింది. వారిని సత్వరమే.. కొవిడ్​ చికిత్స కోసం తరలించినట్లు వెల్లడించింది.

- Advertisement -

వార్షిక మండల పూజకోసం నవంబర్​ 16 నుంచి ఆలయంలోకి భక్తుల ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 10 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారినే దర్శనానికి అనుమతినిస్తున్నారు. కేరళలోని వివిధ ప్రాంతాల్లోని బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు యాంటీజెన్​ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తగిన స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించారు.

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!

అల్లుడు చైతన్య కి నాగబాబు ఎంత ఇస్తున్నారు తెలుసా..?

కృతి శెట్టి చూపు రామ్ చరణ్ వైపు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...