Sunday, May 5, 2024
- Advertisement -

13 ఏళ్ల అమ్మాయిని త‌ల్లిని చేసిన బాలుడు

- Advertisement -

తెలిసి తెలియని వయసులో పిల్లలు తప్పులు చేస్తున్నారు. అది కరెక్టా.. కాదా అని కూడా ఆలోచించే స్థాయిలో వారు ఉండట్లేదు. యువత టెక్నాలజీ ఎంత ఉపయోగిస్తుందో.. అదే స్థాయిలో టెక్నాలజీ వల్ల పడైపోతున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల ఎంత లాభం వస్తుందో అంతే నష్టం కలుగుతోంది. అభివృద్ది పథంలో దూసుకెళ్తోంది అనుకుంటే.. అవసరం లేని వాటిని తెలుసుకునేందుకు ఆరచేతిలో ఉన్న టెక్నాలజీని వాడుకుంటున్నారు.

ముఖ్యంగా సమాజం ఎటు నుండి ఎటు వెళ్తుందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. చైనాలోని ఓ గ్రామంకు చెందిన 13 ఏళ్ల బాలిక‌తో.. 13 ఏళ్ల బాలుడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఆకర్షణగా మారింది. ఇద్దరిలో ఆ వయసులోనే సెక్స్ కోరిక‌లు పుట్టాయి. దాంతో ఆ కోరికను తీర్చుకోవడం కోసం సాహ‌సించాయి. దాంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. శారీరకంగా దగ్గర అయ్యారు కానీ ఆ తర్వాత ప్ర‌కృతిప‌రంగా ఏం జ‌రుగుతుందో వారు తెలుసుకోలేకపోయారు. కొద్ది కాలంగా బాలీకకు కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చెర్పించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పారు. దీంతో గ్రామంలో పంచాయితీ పెట్టి ఆ బాలుడితో 13 ఏళ్ల వ‌య‌సులోనే పెళ్లి చేశారు. బాల్య వివాహం అని తెలిసిన.. ఏం చేయలేక పెళ్లి చేశారు. స్కూల్ కి వెల్లి చదువుకోవాల్సిన సమయంలో తెలిసి తెలియక చేశారు. తప్పు పిల్లలదా.. త‌ల్లిదండ్రులదా.. ఎవరిది అని చెప్పలేం. కానీ పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నా శైలిని త‌ల్లిదండ్రులు.. ఎప్పుడూ ఓ కంటితో కనిపెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -