వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపడుతుందని అభిమానులు తెగ సంబరిపడిపోయారు. కాని నంద్యాల ఉప ఎన్నిక రనరంగాన్ని తలపిస్తుంటె పవన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆఖరికి కాంగ్రెస్ కూడా పోటీ పెడ్తామని ప్రకటించింది. కాని జనసేన మాత్రం తనకు పట్టనట్టు వ్యవహరిస్తోంది.
టీడీపీ కి పవన్ దోస్త్ కాబట్టి కనీసం తన స్పందనకూడా తెలుపలేదు. మరి పవన్ కు సినిమాల నుంచి విరామం ఏమైనా దొరికితే గాని పోటీ గురించి ప్రకటన రాకపోవచ్చు. అది ఆ పార్టీ స్పెషాలిటీ. ఇదిలా ఉంటె టీడీపీ మాత్రం పవన్‌ను నంద్యాల ఎన్నిక ప్రచారంలో విచ్చలవిడిగా వాడుకుంటోంది. వన్ కల్యాన్ ఫొటోను అడ్డంగా, నిలువుగా, వీలైనట్టుగా వాడేస్తోంది టీడీపీ. పవన్ కల్యాణ్ మద్దతు కూడా టీడీపీకే ఉందని.. టీడీపీ నేతలు చెప్పుకొంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున తిరుగుతున్న వాళ్లు ఇదే మాటే చెబుతున్నారు.
జనసేన జెండాలను తయారు చేయించుకుని వాడుకుంటున్నారు. నంద్యాల్లో పవన్ కల్యాణ్ కు పడే ఓట్లు ఎన్ని అనేది తర్వాతి లెక్క. వాడుకునేస్తే తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా ఉంది తెలుగుదేశం వ్యూహం. ఎలాగూ పవన్ కల్యాణ్ క్రితంసారి ఎన్నికల్లో తెలుగుదేశం తరపునే ప్రచారం చేశాడు కాబట్టి.. ఇప్పుడు కూడా తమ వాడే అని తెలుగుదేశం చెప్పేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.
పవన్ కల్యాణ్ తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని అంటున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా నంద్యాల ఉపపోరుపై మారు మాట్లాడటం లేదు. 2019 ఎన్నికలకు ట్రయల్స్ లాంటి ఉపఎన్నికలో తమ వంతుగా పవన్ తో కలిసి బరిలోకి దిగాలని ఎర్రన్నలు ఉబలాటపడుతున్నారు. అయితే పవన్ మాత్రం కిమ్మనడంలేదు.దీనిపై పవన్ కళ్యాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
- Advertisement -
నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్‌ను టీడీపీ విచ్చలవిడిగా వాడేసుకుంటోంది
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
