మనదేశంలో ఆఫీసుల్లో సెలవు తీసుకోవడమనేది ఓ పెద్ద టాస్క్. అది కూడా మన లవర్‌తో స్పెండ్ చేయడానికి అనుకోండి.. ఇక సెలవు గగనమే అని చెప్పుకోవాలి. సవాలక్ష కారణాలు చెప్పాలి… ప్రాధేయపడాలి.. కొన్ని బిస్కట్లు వేయాలి.. అప్పటికీ కూడా పై ఆఫీసర్ కనికరిస్తాడో తెలియదు.
కానీ చైనాలో మాత్రం సీన్ రివర్స్. మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయాలనుకుంటున్నారా? దాని కోసం లీవ్ కావాలా? అంటూ అడిగి మరీ ఇస్తున్నారు. ఇటీవల చైనాలో జరిపిన సెన్సస్ ప్రకారం దేశంలో యువత జనాభా తగ్గిపోయి.. ముసలివాళ్లు ఎక్కువైపోతున్నారని.. దీంతో తమ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోతుందేమోనని ఆదేశ ప్రభుత్వ యంత్రాంగం డైలమాలో పడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి.
దీన్ని అరికట్టేందుకు హాంగ్‍ఝో టూరిస్ట్ పార్కులో గల కంపెనీలు ఉద్యోగులకు ఆఫర్ ప్రకటిస్తున్నాయి. అక్కడ యువత తాము జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనతో 40ఏళ్ల వరకు పెళ్లిళ్లు చేసుకోలేకపోవడం, యువత తగ్గి వృద్ధులు పెరిగిపోతున్నారు.
ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి సహజీవనం చేయండి. అందుకు మా వంతుగా సాధారణ సెలవులతో పాటు మరో 10రోజులు అదనంగా ఇస్తాం. ఆ పదిరోజుల జీతభత్యాల్ని చెల్లిస్తాం. మీరు మాత్రం డేటింగ్ చేస్కోండి. లైఫ్ ను ఎంజాయ్ చేయండి అంటూ ఆఫర్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే ఓ చిన్న మెలిక పెట్టారు. ఈ సెలవులు కేవలం 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు మాత్రమే..
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!