Tuesday, April 16, 2024
- Advertisement -

చైనా “వరుణాస్త్రం” ఫలిస్తుందా ?

- Advertisement -

అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో చైనా కచ్చితంగా ఉంటుంది. టెక్నాలజీ విషయంలో అత్యదునికత ను ప్రదర్శించే చైనా ఎలాంటి సమస్యనైనా కూడా స్వతహాగా పరిష్కరించుకునే సామర్థ్యం పుష్కలంగా కలిగిన దేశం అని చెప్పవచ్చు. అందుకే ప్రపంచ దేశాలలో చైనా ఎప్పుడు ప్రత్యేకంగానే నిలుస్తూ ఉంటుంది. మరి అలాంటి దేశంనూ ఇప్పుడు సరికొత్త సమస్య పిడిస్తోంది. ఆ దేశంలో ఏర్పడిన హిట్ వేవ్ కారణంగా తీవ్రమైన నీటి కొరతను డ్రాగన్ కంట్రీ ఎదుర్కొంటోంది.

దాంతో దేశంలోని చాలా ప్రాజెక్ట్ లు నీరు లేక ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు హిట్ వేవ్ గరిష్టంగా ఉన్న కారణంగా వర్షాలు కూడా మొఖం చాటేశాయి. ఆసియాలోనే అతిపెద్ద నదిగా పేరున్న యాంగ్లీ నదిలో కూడా నీటి మట్టం అడుగంటింది. దీంతో డ్రాగన్ కంట్రీ నీటికోసం విలవిలలాడుతోంది. మరోవైపు విద్యుత్ వినియోగం దేశంలో భారీగా ఉండడంతో.. అవసరాలకు తగినంత విద్యుత్ తయారు చేయలేని పరిస్థితి లో డ్రాగన్ కంట్రీ ఉంది.

చైనా టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అక్కడి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. చైనా విమానాల ద్వారా మేఘాలలో సిల్వర్ అయోడెడ్ ఉపయోగించి మొఘలను ప్రేరేపించి.. మేఘమధనంనూ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే యాంగ్లీ పరీవాహక ప్రాంతాలలో ఈ మేఘామధనం మొదలు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక అధిక ఉష్ణోగ్రతల కారణంగా డ్రాగన్ కంట్రీ లోని చాలా నగరాలలో రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరి వర్షాలు లేక విలవిలలాడుతున్న డ్రాగన్ కంట్రీకి కృత్రిమ వర్షాలు ఎంతమేర దహాన్ని తీరుస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -