పదిసార్లు అబద్దాన్ని నిజం అంటే కొన్ని సందర్భాలలో ప్రజలు అవును కాబోలు అనే స్టేజ్ కు వచ్చేస్తుంటారు. దీన్ని మనం ఎల్లో జర్నలిజం అంటూ ఉంటాం. బీజింగ్ లో ఇలాంటిదే ఒకటి జరిగింది. చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి అతడు మూగవాడిగా నటించాడు. చివరకు మూగతనమే అతనిపాలిట శాపంగా మారి… మూగవాన్ని చేసింది. వినడానికి వెంకటేష్ నటించిన శీను చిత్రం గుర్తుకు వస్తుంది. అందుల్లో కూడా ఆల్మోస్ట్ ఇదే కథ.అయితే అందుల్లో వెంకీ ప్రేమకోసం మూగవాడయ్యాడు.
ఈ ఉదంతం చైనాలో జరిగింది. 12 సంవత్సరాల పాటు మూగవాడిగా న టించిన ఓ వ్యక్తి చివరకు నిజంగానే మాట కోల్పోయాడు.అసలేం జరిగిందంటే… ఝెజియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన జెంగ్ 33 ఏళ్ల చెంగ్ 2005లో కేవలం 5 వేల రూపాయల అద్దె వివాదంలో తన భార్య తరపు బంధువొకరిని చంపేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సొంతూరు వదిలిపెట్టి మరో ప్రావిన్స్‌కు పారిపోయాడు. పేరు మార్చుకుని మూగవాడిగా నటిస్తూ ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు.
ఐతే విది ఎవరినీ వదిలిపెట్టడు కదా. రహస్య జీవితం గడుపుతున్న జెంగ్‌పై పోలీసులు కన్నుపడింది. అతడి దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీనితో పోలీసులు గత అక్టోబర్‌లో అతడి రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ హత్య కేసు నిందితుడి తల్లిదండ్రులతో జెంగ్ డీఎన్‌ఏ మ్యాచ్ అయింది. అసలు విషయం తెలిసిపోవడంతో జెంగ్ ఇక చేసేది లేక నేరాన్ని అంగీకరించాడు. 12 ఏళ్లు మూగవాడిగా నటించడంతో మాట కోల్పోయానని అతడు పేపర్‌పై రాసి పోలీసులకు వెల్లడించాడని స్థానిక దినపత్రిక ఓకటి పేర్కొంది. ఒకవేళ అతడు దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశముందని చెబుతున్నారు.