శ్రీలంక, చైనా విషయంలో.. భారత్ ఆందోళన ఎందుకు ?

ఇటీవల చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక లోని హంబన్ టోట పోర్ట్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నౌక శ్రీలంక చేరుకోవడాన్ని భారత్ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. ఈ నౌక వల్ల భారత్ కు భద్రత పరమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందువల్ల ఈ నౌకను శ్రీలంకకు చేరుకోకుండా ఆపాలని భారత్ శ్రీలంక ను కోరింది. కానీ శ్రీలంక ఆ నిఘా నౌక రాకను అడ్డుకోలేని పరిస్థితి ఉండడంతో శ్రీలంక సైలెంట్ గా ఉంది. ఎందుకంటే శ్రీలంక కు భారత్ తో సత్సంబంధాలు బాగానే ఉన్నప్పటికి, చైనా గుప్పెట్లో శ్రీలంక ఉండడంతో భారత్ మాటలను పెడ చెవిన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలు ఆ నౌక శ్రీలంక చేరడం వల్ల మన దేశానికి వచ్చే నష్టమేంటి ? ఎందుకు మనదేశం ఆ నౌక శ్రీలంక చేరడాన్ని అభ్యంతరం తెలుపుతోంది ? అని విషయానికొస్తే.. బలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాలను ట్రాక్ చేయడంతో పాటు, గగనతలంలో 750 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ నౌక నిఘా ఉంచగలదు. దాంతో మనదేశం పై ఎప్పుడు నిప్పులు చెరిగే చైనా.. మనదేశానికి సంభంధించిన రక్షణ సమాచారాన్ని గుర్తించి కయ్యనికి కాలు దువ్వే అవకాశం ఉంది.

అందువల్లే మనదేశం చైనా నౌక శ్రీలంక చేరడాన్ని తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. అయితే చైనా ఏం చెబుతోందంటే.. రెండు మిత్రదేశాలను సంబంధించిన వ్యవహారం లో భారత్ ఎందుకు తల దూరుస్తుందని, ఇది భారత్ కు సంభంధించిన వ్యవహారం కాదని చైనా చెబుతోంది. ఇక ఈ అభ్యంతరాల నడుమ శ్రీలంక చేరుకున్న చైనా నిఘా నౌక ఈ నెల 22 వరకు అక్కడే ఉండనుంది.

Also Read

మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

Related Articles

Most Populer

Recent Posts