ఆడియో ఫంక్షన్ లలో సుమతో పాటు యాంకరింగ్ కి ఆలీ ని పెట్టుకుంటే తెల్లారే సరికి ఒక భారీ వివాదం తెచ్చి పెడుతున్నాడు ఆయన. అప్పట్లో కమెడియన్ లతో, తరవాత హీరోలతో డబల్ మీనింగ్ జోక్ లు పేల్చి ఇరగాదీసిన ఆలీ ఇప్పుడు రాను రానూ హీరోయిన్ ల అంగాంగ వర్ణన లతో ఊహించడానికి కూడా సాధ్యం కాని బూతు జోకులు వేస్తున్నాడు.
ఈ విషయంలో చాలా సీరియస్ అవుతునారు లేడీ సినిమా ప్రేక్షకులు. తోటి యాంకర్లతో డబుల్ మీనింగులు డైరెక్టుగానే వర్ణనలతో ఫంక్షన్లలో డిగ్నిటీ చెడగొడుతున్నాడనే విమర్శలపై ఆలీ తొలిసారిగా నోరు విప్పాడు. ఈ విషయంలో టీవీ 9 కి ఇచ్చిన ప్రత్యేక షో లో మాట్లాడిన ఆలీ అదంతా కేవలం ఆడియన్స్ నవ్వుకోవడానికి మాత్రమె చేసిన పని అని వేరే ఉద్దేశ్యం లేదు అని చెప్పుకొచ్చాడు ” అనుష్క కీ నాకూ సూపర్ సినిమా సమయం నుంచీ పరిచయం ఉంది.
ఆమె మీదే కానీ వేరే ఎవరి మీదైనా నాకు కోపం , ద్వేషం ఉండదు. కేవలం కామెడీ చెయ్యడం కోసం అలాంటి కౌంటర్లు వేస్తాం అంతే, వారు ఆ విషయాన్ని బాగానే తీసుకుంటున్నారు కానీ అనవసరం అయిన వారు అవసరం లేని గొడవలు చేస్తున్నారు.” అంటూ సమాధానమిచ్చారు. న్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ లో సమంత నడుంపై ఇలాంటి కామెంట్సే చేయడంతో.. ఓ మహిళ (అన్న పూర్ణ సుంకర)యూట్యూబ్ ద్వారా చెడుగుడు ఆడేసుకుంది. ఈ విషయం అడిగినప్పుడు తనకి ఏం తెలుసు అని తన గురించి మాట్లాడుతోంది అంటూ సీరియస్ అయ్యాడు. తన డాక్టరేట్ విషయం గురించి మాట్లాడడానికి ఆమె ఎవరు అని ఎదురు ప్రశ్నించారు ఆలీ. ‘నేను 350 సినిమాల్లో చేసినందుకు డాక్టరేట్ ఇవ్వలేదు. పదేళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి అది ఇచ్చారు” అన్నాడు ఆలీ.
{youtube}YEI0A2QZFXo{/youtube}