Friday, April 26, 2024
- Advertisement -

అనుష్క తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే నా..?

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం సినిమా తోనే సైలెంట్ అవనుందా అంటే నిశ్శబ్దం సినిమా చూసినా ఎవరైనా అదే మాట అంటారు.. బాహుబలి, అరుంధతి, భాగమతి లాంటి సినిమా చేసిన అనుష్క ఇలాంటి చిత్రాన్ని చేయడం పట్ల అందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. స్టోరీ లు వెతుక్కునేప్పుడు కొంచెమైనా జాగ్రత్తలు తీసుకోవద్దా, అసలే తనకు సినిమాలు వస్తాయో రావో అన్న టైం అనుష్క ఇలాంటి సినిమాలు చేసి మరింత పోగొట్టుకోవడం అవసరమా అని ఆమె అభిమానులు సైతం గుసగుసలాడుకుంటున్నారు..

వాస్తవానికి జేజెమ్మ పని బాహుబలి తోనే అయిపోయిందని చెప్పాలి.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న అనుష్క టైం ఇప్పుడు దాదాపు అయిపోవచ్చింది.. బాహుబలి లాంటి హిట్ చేసిన ఆమెకు ఆ తర్వాత కనీసం హీరో తో అయినా హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాలేదు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే నమ్ముకుని సినిమాలు చేస్తూ వచ్చింది. భాగమతి తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా నిశ్శబ్డం.. ఎంతో వెరైటీ సినిమాగా రాబోతుందని అనుష్క ఫాన్స్ ఆశపడ్డారు.. ఈ సినిమా తో స్వీటీ మళ్ళీ ఫామ్లోకి వస్తుందో అనుకున్నారు.. తీరా సినిమా ఫలితం చూస్తే ఇది పరిస్థితి..

అంతేకాదు అనుష్క ఫిజిక్ కూడా ఇప్పుడు పెద్ద సమస్య గా మారిపోయింది.. సైజు జీరో సినిమా కోసం ఆమె పెంచిన ఫిజిక్ ఇంకా తగ్గించుకోకపోవం ఇప్పుడు పెద్ద మైనస్ గా తయారైంది.. పైగా అనుష్క కు వున్న ఫిజిక్ కు హీరోయిన్ పాత్రలు ఇప్పుడు సూట్ కావు. ఆమె డ్యాన్స్ లు చేసే స్టేజ్ దాటిపోయారు. కేవలం పెర్ ఫార్మెన్స్ కోసం తీసుకోవాలి. కానీ అందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం అనవసరం అన్నదే నిర్మాతల ఆలోచన కూడా. నిశ్శబ్ధం సినిమాలో అనుష్క డిజిటల్ ఫిజికల్ కరెక్షన్ కు రెండు కోట్లకు కాస్త దగ్గరగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అంత ఖర్చుచేసినా, ఎంత చెక్కగలరో అంతే చెక్కగలరు. అంతకన్నా చెక్కడం అసాధ్యం. అందువల్ల కూడా అనుష్కకు ఇక చాన్స్ లు రావడం తక్కువే అనుకోవాలి.  అయినా ఇన్నాళ్లు లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన తరువాత ఇక హ్యాపీగా రిైటర్ అయిపోవడమే. కొత్త అమ్మాయిలు వరుసగా వచ్చేస్తున్నారుగా.

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

హిట్ డైరెక్టర్ కి హీరో లేడేంటి.. ఆయనకు ఏంటి దుస్థితి..?

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

ఎన్టీఆర్ కూడా మొదలుపెట్టడా.. భార్య తో కలిసి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -