రోజు తెల్లవారు జామున మాజీ మంత్రి మూఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పులకు గురయ్యారు. ఈ కాల్పులు ఎవరు జరిపారు అనే విషయం తెలియాల్సి వుంది. కానీ ఈ విషయంపై పలు అనుమానాలు వస్తున్నాయి. అందుకు కారణం విక్రమ్ గౌడ్ ఫోన్ లో ఉన్న మెసేజులే. ఈ కాల్పుల వెనక ఎవరు ఉన్నారో అనే సంగతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న విక్రమ్ గౌడ్ భార్య మాత్రం.. ఈ పని చేసింది ఆగంతకులే అని అంటోంది.
అయితే చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో.. పోలీసులకు మరిన్ని అనుమానాలు కలుగున్నాయి. అయితే ఈ విషయం సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు విక్రమ్ గౌడ్ ఫోన్ పరిశీలించినట్లు తెలుస్తోంది. అందులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. డ్రగ్స్ కు సంబంధించి గత పది రోజులుగా సాగుతున్న సిట్ విచారణను సంక్షిప్తంగా భద్రపరుచుకున్నాడు విక్రమ్ గౌడ్. దానికి తోడు విక్రమ్ గౌడ్ వాట్సాప్ లో 39 మెసేజ్ లు ఉన్నాయని.. అందులో సగంకు పైగా అప్పుల వాళ్లు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్న మెసేజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు విక్రమ్ గౌడ్ కు జూబ్లీ హిల్స్ లో పబ్ వుంది.
అందులో కూడా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు.. అందుకే విక్రమ్ గౌడ్ భయపడి ఉంటాడని పోలీసులు అనమానిస్తున్నారు. అందులోనూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించడానికి వెళ్లడం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూరుతోంది. పూరి కలవటం వెనక డ్రగ్స్ పర్మైన లింకులు విక్రమ్ కు నిజంగానే ఉండోచ్చమో అన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అప్పుల బాధ, డ్రగ్స్ కేసు.. ఇలా సమస్యలు మీద పడటంతో ఇలాంటి పని చేసి ఉంటాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పోలీసులు మాత్రం ఈ విషయం దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైన విక్రమ్ గౌడ్ నోరిప్పితే గాని అసలు నిజాలు బయటకు రావు.