Tuesday, April 23, 2024
- Advertisement -

ఐస్​క్రీం​లోనూ కరోనా .. ఎవరు కొన్నరో వారికోసం జల్లెడ..!

- Advertisement -

చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్​క్రీం​లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆ బ్యాచ్​లో ఉత్పత్తి అయిన వేల ఐస్​క్రీం కార్టన్​లను వెనక్కి తీసుకుంటోంది సంస్థ. బీజింగ్​కు సమీపాన ఉన్న తియాన్జిన్​లోని డాకియావొడావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్​లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ బ్యాచ్​లో మొత్తం 29 వేల కార్టన్లు ఇంకా విక్రయించలేదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు. 390 కార్టన్లు తియాన్జిన్​లో అమ్మినట్లు వెల్లడించారు. వీటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.అయితే ఐస్​క్రీంల వల్ల ఎవరైనా కరోనా బారినపడ్డారో లేదో తెలియలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థను సీజ్​ చేసి, అందులోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -