భారత్ లో చైనా జాతీయుల హవాలా.. హవా ఏకంగా రూ.1000 కోట్లు..!

- Advertisement -

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఇద్దరు చైనా జాతీయులకు ఈడీ కస్టడీ విధించినట్లు అధికారులు తెలిపారు. చార్లీ పెంగ్, కార్టర్ లీ అనే వ్యక్తులను కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ కోసం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు అప్పగించినట్లు చెప్పారు.

వీరిపై రూ.1000 కోట్ల విలువైన హవాలా రాకెట్​ను నడుపుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. వీరి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ సోదాలు నిర్వహించిన తర్వాత మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.

- Advertisement -

చార్లీ పెంగ్ వద్ద నకిలీ భారత పాస్​పోర్ట్ సైతం ఉందని అధికారులు తెలిపారు. నకిలీ కంపెనీలు సృష్టించి, చైనా నుంచి భారత్​కు, భారత్​ నుంచి చైనాకు నిధులు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మోసాలు, ఫోర్జరీకి పాల్పడుతున్నాడన్న అభియోగాలతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2018లో చార్లీని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News