మహేష్ శర్మ. భారతీయ జనత పార్టీ నాయకుడు , కేంద్ర సాంస్కృతిక వ్యహారాల శాఖా మంత్రి .
ఈయనగారికి ఒక్కసారిగా ఆడవాళ్ల మీద నోరు పారేసు కోవాలనిపించింది. ఆలోచన వచ్చిందే భాగంగా టంగ్ స్లిప్ అయ్యాడు.
ఆల్రెడీ మొన్నామధ్య మాజీ రాష్ట్ర పతి అయిన అబ్దుల్ కలాం ఆజాద్ మీద నోరు జారిన ఈయనగారు….. ఆ సంఘటన మరిచి పోక ముందే…. మన మహేష్ శర్మ మరోసారి ఇలా వివాదాస్పద వాఖ్యలు చేసారు . అయితే ఈసారి అతను పెద్ద హోదాలో ఉన్న వ్యక్తుల గురించి కాకుండా స్పెషల్ హోదా పొందుతున్న లేడీస్ పై నోరు పారేసుకున్నారు.
రీసెంట్ గా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆడవాళ్లకు రాత్రి సమయంలో బయట ఏం పనుంటుంది. వాళ్లకు బయటకు వెళ్లాల్సిన అవసరమేంటి అని టంగ్ స్లిప్ అయ్యారు.
మళ్లీ తాను చెప్పిన మాటను కవర్ చేస్తూ…. బయటి దేశాలలో ఆడవారు నైట్ టైమ్ బయట తిరుగుతారేమో కానీ…. మన దేశం లో అలా కాదు, కుదరదు అంటూనే … మన దేశం విలువలు కట్టుబాటులకి పెట్టింది పేరని దయచేసి అటువంటి సంప్రదాయాలున్న మన దేశ మర్యాదని మంట గలపద్దు అని తీవ్రంగా మాట్లాడారు.