Sunday, May 19, 2024
- Advertisement -

అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌తో క‌న్నీళ్లు పెట్టిన దంగ‌ల్ న‌టి.. విమానంలో ఆగంత‌కుడి వేధింపులు

- Advertisement -
  • మెడ‌, గొంతుపై కాలేసి దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

మొన్న ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు జుక‌ర్ బ‌ర్గ్ సోద‌రిని అల‌స్కా ఎయిర్‌లైన్స్‌లో కొంద‌రు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. ఈసారి అదే మాదిరి విమానంలో ఓ న‌టిని అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించి వేధించారు. దీంతో ఆ న‌టి క‌న్నీళ్లు పెట్టుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా వేధింపులకు బలవుతున్నారు. `దంగల్’ నటి జైరా వాసిమ్ (17)కి విమానంలో వింత‌ అనుభవం ఎదురైంది.
వాసిమ్ ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్‌పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడు. దీనికి తాను అభ్యంతరం తెలిపినా అలాగే ఉంచాడు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడంతో తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు. తర్వాత నిద్రపోతున్న సమయంలో తన మెడపై ఆ వ్యక్తి తన కాలితో తడిమాడని, ఆ విషయాన్ని తాను గ్రహించిన తర్వాత, ఆ దృశ్యాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే విమానంలో వెలుతురు తక్కువగా ఉండ‌డంతో ఆ భయానక దృశ్యాలను రికార్డు చేయలేకపోయానన్నారు. కానీ కొంత వరకు ఆ దుర్మార్గుడి దుశ్చర్యను రికార్డు చేయగలిగినట్లు తెలిపారు. తన మెడ, భుజంపై ఆ వ్యక్తి తన కాలితో తడమటం దాదాపు 5 నుంచి 10 నిమిషాలపాటు కొనసాగినట్లు తెలిపారు.

ఈ విధంగా జరిగి ఉండవలసినది కాదని జైరా రోదిస్తూ చెప్పింది. తాను తీవ్రంగా కలత చెందాన‌ని, మహిళలను రక్షించేది ఈ విధంగానేనా? అని ఇన్‌స్టాగ్రామ్‌లో నిల‌దీశారు. ఎవరినీ ఈ విధంగా చేయకూడదన్నారు. ఇది చాలా దారుణమని, భయానకమని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ వివరాలను తెలిపారు. ఇంత చేస్తున్నా విమానంలో త‌న‌కు ఎవ‌రూ స‌హ‌క‌రించలేని వాపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -