Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ భజన ముందు ఎల్లో మీడియా, టిడిపి నాయకులందరూ తేలిపోయారా? సాక్షి కూడా పవన్ పాఠాలు నేర్చుకోవాలా?

- Advertisement -

వాహ్…….పవర్ స్టార్…….నువ్వు దేవుడివే సామీ…….ఇప్పటి వరకూ తెలుగు నాట తన డబ్బు తానే కొట్టుకోవాలన్నా, డప్పు కొట్టించుకోవాలన్నా చంద్రబాబు తర్వాత ఎవరైనా అని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకేం తెలుసు పవన్ కళ్యాణ్ వస్తాడని. సినిమాల్లో కూడా పవన్ సినిమా ఫంక్షన్స్‌ని ఎప్పుడైనా పరిశీలించారా? తెలుగు నాట……ఆ మాటకొస్తే మొత్తం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పొగడ్తల భజన వినిపించే సినిమా ఫంక్షన్స్ ఏ హీరోవి అని విశ్లేషిస్తే కచ్చితంగా పవనే అగ్రస్థానంలో నిలుస్తాడు. పంచ్ డైలాగులతో మేధావి అనిపించుకున్న త్రివిక్రమ్ చేత గ్రాంధిక భాషలో భజన చేయించుకోగలడు. తను దర్శకత్వం వహించిన సినిమాల్లో హీరో పాత్రలను పొగడడానికి కూడా త్రివిక్రమ్ ఆ స్థాయిలో కష్టపడి ఎప్పుడూ డైలాగులు రాసి ఉండడేమో. మరోవైపు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది చేత మోసగాడుగా, చెడ్డవ్యక్తిగా తిట్టించుకుంటూ ఉండే, సొంత ఆలోచనలు లేనట్టుగా కనిపించే ఓ కమెడియన్ కం బినామీ ప్రొడ్యూసర్ చేత అంతకంటే గొప్పగా పొగిడించుకోగలడు. అఫ్కోర్స్ ప్లానింగ్ అంతా పవన్‌దే అన్న విషయం ఆయనతో వర్క్ చేసిన డైెరెక్టర్సే చెప్తూ ఉంటారనుకోండి. మరి ఆ స్థాయిలో తన భజన ఎలా చేయించుకోవాలో తెలిసినవాడికి భజన ఎలా చేయాలో తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. భజన విషయంలో ప్రపంచానికి పాఠాలు చెప్పగలిగే స్థాయి ఉన్న చంద్రబాబుకే కొత్త పాఠాలు చెప్పగలిగే స్థాయిలో తెలుసు.

కావాలంటే కొన్ని పవన్ పలుకులూ మీరూ చదవండి. మీకే తెలుస్తుంది.
పడవ ప్రమాదంలో ఇరవై మందికి పైగా చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు, అవినీతి సొమ్ముకు ఆశపడి ఇద్దరు టిడిపి మంత్రులు అక్రమంగా బోట్లు తిరగడానికి ఎలా కారణమో అందరికీ తెలుసు. బాబు భజన మీడియాలో మంత్రుల మంత్రాంగం గురించి వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్‌కి మాత్రం అవేవీ కనిపించలేదు. బాబు చేతకానితనం కాని, బాబు ప్రమేయం కానీ అస్సలు కనిపించలేదు. అఖిల ప్రియ బాధ్యత వహించాలట. చంద్రబాబుకు తెలియకుండా ఒక్క నిర్ణయమైనా తీసుకోగలిగే స్థాయిలో అఖిల ప్రియ ఉందా? యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రులకే ఆ అవకాశం ఉండదు. ఇక అఖిలప్రియ చంద్రబాబుకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకోగలదా? కచ్చితంగా తీసుకోలేదు. అయితేనేం చంద్రబాబును కాపాడాలంటే ఎవరినో ఒకరిని బలిపశువును చెయ్యాలి కాబట్టి అస్సలు శక్తి సామర్థ్యాలు, బలం, బలగం లేని అఖిల ప్రియను దోషిగా నిలబెట్టాడన్నమాట. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారు అన్న ప్రశ్న బాబుకు ఎధురైనప్పుడల్లా పేద రాష్ట్రం అంటూ బీద మాటలు చెప్పాడు కానీ ఇకపై బాబుకు అలాంటి అవసరం రాకుండా పవన్ బ్రహ్మాండమైన భజన ట్రిక్ కనిపెట్టాడు. ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చి ఉన్నా ఏమీ చేసి ఉండేవాడు కాదు అని ఒక ప్రకటన పడేశాడు పవన్. సో…..జగన్ కూడా చేసి ఉండేవాడుకాదు…..చెయ్యడు అని జనాలను నమ్మిస్తే చాలు……జగన్ కూడా చెయ్యడు కాబట్టి మళ్ళీ కూడా చంద్రబాబుకే ఓటేద్దాం అని జనాలు ఫిక్స్ అవ్వాలన్నమాట.

ఇక అన్నింటికీ మించి బాబుతో సహా ఆయన భజన మీడియా, టిడిపి నాయకులందరూ కూడా సమాధానం చెప్పలేక అసహనంతో రగిలిపోతున్న ఓటుకు కోట్లు తప్పును మాత్రం నిప్పు చేసేశాడు పవన్. ఓటుకు కోట్లు కేసులో బాబు అడ్డంగా దొరికిపోవడంపై స్పందించమని అడిగినప్పుడు పవన్ భలే సమాధానం చెప్పాడు. చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నిస్తే, ఆయనను విమర్శిస్తే ఆయన సక్రమంగా బాధ్యతలు నిర్వహించలేడట. అందుకే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే బాబు తప్పులను ఎవ్వరూ ప్రశ్నించకూడదట.

శభాష్…….పవర్ స్టార్‌గా సినిమాల్లో యాక్ట్ చేయడం పవన్‌కి పెద్దగా రాదు కానీ బాబు భజన చేయడంలో మాత్రం ఆకాశమే హద్దు అనే స్థాయిలో చెలరేగిపోతున్నాడు. ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పుకోలేక నానా అవస్థలూ పడుతున్న చంద్రబాబుకు, బాబు భజన మీడియాకు, టిడిపి నాయకులకు అద్భుతమైన భజన మార్గం చూపించాడు పవన్. అలాగే జగన్ భజన చేయడంలో…కనీసం జగన్‌పై వస్తున్న అబద్ధపు ఆరోఫణలను ఖండించడంలో కూడా ఘోరంగా విఫలమవుతున్న సాక్షి మీడియా కూడా పవన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఎప్పుడూ జగన్‌ని చూపించడం మానేసి కాస్త పవన్ నుంచి భజన ఎలా చేయాలో నేర్చుకుంటే బెటరేమో. ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -