Monday, May 5, 2025
- Advertisement -

దాసరి నారాయణ రావు ఇక లేరు..

- Advertisement -
Dasari Narayana Rao passes away

ప్రముఖ సినీ నటుడు.. దర్శకులు.. దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. జనవరి 19న తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కిమ్స్ వైద్యులు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత సుమారు మూడు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్న అయన నెమ్మదిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.

ఆయనకు ఈ నెలలోనే రెండవసారి చికిత్స జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు తీవ్ర ఆనరోగ్యానికి గురవ్వడంతో.. కుటుంబ సభ్యులలు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స్ అందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. మరి కొద్ది సేపట్లో పార్థివదేహాన్ని స్వగృహానికి తీసుకురానున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. అత్యధిక సినిమాల డైరెక్టర్ గా గిన్నిస్  రికార్డుల్లోకెక్కారు. దాదాపు 150 సినిమాలకు దర్శకత్వం వహించారు.  

{loadmodule mod_custom,Side Ad 1}

53 సినిమాలను స్వయంగా నిర్మించారు. 250కి పై చిత్రాలకు మాటల రచయిత గా సేవలు అందించారు. గీతరచయితగా కూడా ఆయన పని చేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించిన ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -