సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

పుష్ప: ది రైజ్… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢైరెక్టర్ సుకుమారు కాంబినేషన్ వచ్చి సంచలనం సృష్టించిన సినిమా. గత ఏడాది డిసెంబరు 17న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగిన ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పుష్ప డైలాగ్స్, సాంగ్స్ తో చేసిన షార్ట్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా సూపర్ హిట్ అయింది. సమంత డాన్స్, ఆమె బోల్డ్ లుక్స్ అభిమానులకు కిక్ ఎక్కించాయి. యూట్యూబ్ లో నైతే 100 మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు సృష్టించిందీ సాంగ్. దాంతో త్వరలో తీయబోయే పుష్ప-2లోనూ సమంత మరో స్పెషల్ సాంగ్ లో నటించబోతోందన్న ప్రచారం జరిగింది. అయితే సమంతకు నిరాశే ఎదురు కానుంది. పుష్ప-2లో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసిన డైరెక్టర్ సుకుమార్..ఈ సారి సామ్ కు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

పుష్ప-2లోని స్పెషల్ సాంగ్ కోసం సమంత స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి ఊ అంటావా పాట కోసం ముందుగా దిశాను మేకర్స్ సంప్రదించారట. అయితే రెమ్యూనరేషన్ వంటి కారణాలతో అప్పుడు సాంగ్ చేయడానికి నిరాకరించిందని తెలుస్తోంది. ఇక పుష్ప-2లో మాత్రం ఐటమ్ సాంగ్ చేయడానికి దిశా ఆసక్తి కనబరుస్తోందట.

Related Articles

Most Populer

Recent Posts