Thursday, April 25, 2024
- Advertisement -

త్వ‌ర‌లో ఆరెస్ట్ అయ్యే అవ‌కాశాలు.. నివేదిక రాగానే సినీ ప్రముఖుల అరెస్ట్ మొద‌లు

- Advertisement -

త్వ‌ర‌లో టాలివుడ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హ‌రాంలో మ‌రో సంచ‌ల‌నాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్ప‌టికే సినిమా ఇండ‌స్ట్రీని ఒ కుదుపు కుదిపేస్తున్న వ్య‌వ‌హ‌రాం మ‌రో మ‌లుపు తిర‌గ‌నుంది. నిందుతుల‌ను సిట్ ఇప్ప‌టికే విచార‌న‌ను వేగ‌వంతం చేసింది.ప‌క్కా సాక్ష్యాధారాల‌ను సేకిరించిన అధికారులు అరెస్ట్‌ల‌పై దృష్టి సారించారు.
ముందుగా స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను శ‌నివారంలోగా అరెస్ట్ అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని సిట్ వ‌ర్గాలు అభిప్రాయ పుడ‌తున్నాయి. ముంద‌నుంచి పూరీనె టార్గెట్ చేయ‌డంతోపాటు గా క‌నిపిస్తోంది. కేసు మొత్తం ఇప్పటివరకూ పూరీ చుట్టే తిరుగుతూ ఉండటం, ఇతరులకు పంపిణీ చేశాడనటానికి పక్కాగా ఆధారాలు లభించడమే ఆయన అరెస్ట్ కు దారితీయనుందని తెలుస్తోంది. ఇక పూరీ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటాడని అనుమానిస్తున్న సిట్, ఇప్పటికే, రక్తం, వెంట్రుకలు తదితరాల నమూనాను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సంగతి తెలిసిందే.
ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పూరీ డ్రగ్స్ వాడుతున్నట్టు వెల్లడైతే, ఈ కేసులో అది బలమైన సాక్ష్యంగా మారుతుందని సిట్ భావిస్తోంది. పూరీ జగన్నాథ్ తెప్పించే డ్రగ్స్ ను తనతో పాటు చార్మీ, ముమైత్ ఖాన్ లకు ఇచ్చేవాడని సుబ్బరాజు స్వయంగా వెల్లడించడంతో ఇక అరెస్ట్ తప్పదని సమాచారం.
విచార‌రోజె అరెస్ట్ త‌ప్ప‌ద‌నే వార్త‌లు వినిపించాయికాని ఆయ‌న‌ను విడిచె పెట్టారు అధికార‌లు.తాము కేవలం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసమే ఎదురు చూస్తున్నామని, ఆ నివేదిక రాగానే సినీ ప్రముఖుల అరెస్ట్ ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -