Sunday, April 28, 2024
- Advertisement -

బాబును ప్రజ‌లు న‌మ్మ‌ర‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక గెలుపును ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్న చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగె షాక్‌లు త‌గులుతున్నాయి.నియేజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు బాబును న‌మ్మె ప‌రిస్థితుల్లో లేరు. ఉప ఎన్నిక నేప‌థ్యంలో రెండోసారి నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సీఎంకు అక్క‌డి ప్ర‌జ‌లు షాక్ ఇచ్చారు.
హెలికాఫ్టర్ దిగడంతోనే షాక్ ఇచ్చారు అక్కడి జనం. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో చంద్రబాబుకు చుక్కలు చూపించారు. తరువాత బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌నిపించ‌లేదు. తాను నంద్యాల‌ను అభివృద్ధి చేస్తాన‌ని చెప్పినా జ‌నం నుంచి చ‌ప్ప‌ట్లు రాల‌లేదు. అడిగినా జ‌నం స్పందించ‌లేదు.
ఇటు సాయంత్రం జ‌రిగిన చంద్ర‌బాబు రోడ్ షో అట్ట‌ర్ ప్లాప్ అయింది. జ‌నం లేక వెల‌వెల‌బోయింది. ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాదాపు 200 కోట్ల‌కు పైగా వ‌రాలు ప్ర‌క‌టించినా జ‌నం నుంచి ఆశించిన స్పంద‌న రాలేదు. దాదాపు నెల‌రోజులుగా కులానికో మంత్రి అక్క‌డ తిరుగుతున్నారు. వారందిరికి తాయిలాలు ప్ర‌క‌టిస్తూ ఆప‌సోపాలు పుడ‌తున్నారు.
రాష్ట్ర‌సీఎం ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తున్నారంటె హ‌డావుడి వేరు.కాని నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో బాబుకు మాత్రం ఒక స‌ర్పంచ్ లీడ‌ర్ స‌బ‌కు వ‌చ్చిన జ‌నం కూడా రాక‌పోవ‌డంతో…బాబు ప‌రిస్థితి స‌ర్పంచ్ స్థాయికి దిగ‌జారార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.
రోడ్ షోలో బాబు వెంట ఐదుగురు మంత్రులు ఉన్నా ….జ‌నం మాత్రం రాలేదు.ఒక గ‌ల్లీ లీడ‌ర్‌…లేక ఒక ఎమ్మెల్యే తిరిగినా వ‌చ్చే జ‌నం కూడా సీఎం రోడ్ షోకు రాలేదు. దీంతో టీడీపీ నేతలు ట్రాఫిక్‌ను ఆపారు. చంద్ర‌బాబు రోడ్ షోకు జ‌నం వ‌చ్చిన‌ట్లు క‌ల‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.ఎన్ని క‌ల‌రింగ్‌లు ఇచ్చినా బాబుకు ఇది అవ‌మాన‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -