Saturday, May 4, 2024
- Advertisement -

Watch: సముద్రంలో పడ్డ ఐఫోన్ … తెచ్చిచ్చిన డాల్ఫిన్

- Advertisement -

ఉన్నట్టుండి ఆమె ఐఫోన్ సముద్రంలో పడిపోయింద.ఇక అంతా అయిపోయిందనుకున్నారు. తన విలువైన సమాచారమంతా తన ఐఫోన్ తోనే సముద్రంలో కలిసి పోయిందని ఆమె కలవరపడింది.

కాని ఆమె కలవరపాటును అర్ధం చేసుకున్న ఓ డాల్ఫిన్…. పోయిన ఐఫోన్ ను సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి మరీ… వెతుక్కుని పట్టుకొచ్చింది.ఇదంతా అట్లాంటిక్ సముద్రం మధ్య భాగంలోని బహమాస్ ప్రాంతంలో మయామి హీట్ డ్యాన్సర్….. తెర్రిస్సాకీ ఫొటో షూట్ చేసే సందర్బంలో ఎదురైన విచిత్ర సంఘటన.

ఫొటో షూట్ చేసే సమయంలో తన ఐఫోన్ ను పట్టుకోమని తెర్రిస్సా తన ఫ్రెండ్ కు ఇవ్వబోగా…. ఆమె బ్యాలెన్స్ కోల్పోయి ఐ ఫోన్ ను బోట్ నుంచి సముద్రంలోకి జార విడిచి పెట్టేసింది. దాంతో అక్కడే ఉన్న క్యాసిక్యూ అనే డాల్ఫిన్ ఆమె ఐఫోన్ ను తిరిగి తెచ్చి ఇచ్చింది. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ దృశ్యాన్నంత అక్కడే ఉన్న ఆమె స్నేహితుడు షూట్ చేయడంతో…. ప్రజెంట్ ఈవీడియో నెట్ లో ప్రపంచమంతా చక్కెర్లు కొడుతోంది.ఇంతకీ ఈ డాల్ఫిన్ గురించి మీకు చెప్పలేదు కదూ.

క్యాసిక్యూ అనే పేరుగల ఈ డాల్ఫిన్ టూరిస్ట్ లు వచ్చినపుడు అక్కడ ఎన్నో విన్యాసాలను ప్రదర్శించడంలో ఆరితేరిన తురుపు ముక్క. ప్రస్తుతానికైతే ఈ డాల్ఫిన్ గ్రాండ్ బహామా ఐలాండ్ వారిది.

{youtube}tJuWWAFG8LU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -