Thursday, May 2, 2024
- Advertisement -

మతంకంటే మానవత్వమే గొప్ప ని నిరూపించారు

- Advertisement -

మతం గోడలను పగలగొట్టేది మానవత్వమే అంటారు. ఇది కొన్ని సందర్బల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మొన్నటి మొన్న ఓ సిక్కు యువకుడు తన తలపాగాను తీసి మరీ…నీళ్లలో కొట్టుకుపోతోన్న యువకులను కాపాడాడు.

ఆ సమయంలో అతను మతాచారాలను పక్కన పెట్టాడు.కాబట్టే అతను కొందరి ప్రాణాలను కాపాడాడు.లేకపోతే జరగరానిది జరిగిపోయేది.తాజాగా ముంబాయిలోని వడాలా ప్రాంతంలో  ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది.

ముంబాయికి చెందిన ఇల్యాజ్ షేక్ పురిటి నొప్పులతో బాధపడుతోన్న తన భార్య నూర్జహాన్ ను కారులో ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాడు.

ఒక్కసారిగా నొప్పులు ఎక్కువ కావడంతో…. కారులోనే ఆమె ప్రసవించే సందర్భంగా వచ్చింది. ఐతే అలాంటి ప్రసవానికి తన కారు ఇచ్చేది లేదని కార్ డ్రైవర్ ఆ దంపతులకు చెప్పి వారిని బయటకు దింపేశాడు.

 రోడ్డు మీద అవస్త పడుతున్న ఆ జంటను… అక్కడికి సమీపంలో గణేష్ గుడిపక్కన కబుర్లు చెపుకుంటోన్న స్థానిక మహిళలు చూశారు.నూర్జహాన్ పడుతోన్న బాధను చూసి వారు చలించి పోయారు. అంతే మతం వారికి గుర్తు రాలేదు.వెంటనే నూర్జహాన్ ను గుడిలోపలి ప్రాంగణంలోకి తీసుకుపోయి చుట్టూ చీరలు కట్టి ఆమెకు పురుడు పోశారు.ఆ తరువాత నూర్జహాన్ ను ఆమె భర్త ఇల్యాజా షేక్ అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకుపోయాడు.ప్రస్తుతం ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్న భార్య బిడ్డలను స్థానిక మీడియా ప్రశ్నించగా…గణేష్ గుడిలో తనకు  మగ బిడ్డ పుట్టాడు.ఇంతకంటే అదృష్టమేముంటుంది.అందుకే తాను ఆ గణేషుడి పేరే తమ బిడ్డకు పెడతానని నూర్జహాన్ చెప్పడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -