Thursday, April 18, 2024
- Advertisement -

పవన్ సింహం కాదు.. మేక, సారీ అదీ కాదు పిల్లి!

- Advertisement -

పవన్ కల్యాణ్ తాజా ప్రెస్ మీట్ గురించి స్పందనలు కొనసాగుతున్నాయి. పవన్ స్పందించిన 24 గంటలకు అనేక మంది ఆయన విషయంలో స్పందించారు. కొందరేమో పవన్ మాటలకు స్పందించాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించగా..

మరికొందరు పవన్ పై ఘాటైన విమర్శలు చేశారు. పవన్ తీరును వారు ఖండించారు. పవన్ మాటల్లో పసలేదని.. ఆయన ఆరు నెలలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కుదరదని వారు దుమ్మెత్తిపోశారు.

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ విషయంలో స్పందించాడు. ఆది నుంచి పవన్ కల్యాణ్ విషయంలో ట్విటర్ లో స్పందిస్తూ వస్తున్న వర్మ తాజాగా కూడా  జనసేన అధినేతపై ట్వీట్లు పెట్టాడు. అయితే ఈ సారి వర్మ ట్వీట్లు పవన్ తీరును ఎద్దేవాలా చేసేవిలా ఉన్నాయి. పవన్ ను గర్జించే సింహం లాంటి వ్యక్తి అని పొగిడినట్టుగానే పొగడి.. అయితే ఆ సింహం ఇప్పుడు మేకలా మారిపోయిందని, పిల్లిలా మాట్లాడుతోందని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. 

సింహంలాంటి పవన్ పిల్లిలా ఉండకూడదని తాను విన్నవించుకొంటున్నానని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అభిమానులు ఆయన నుంచి కోరుకొంటున్నది పిల్లిలాంటి అరుపులు కాదని.. సింహంలాంటి గర్జనలు అని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు. సింహం సింహంలా ఉండాలి.. తన ప్రతిమాటకూ కుక్కలకు వివరణ ఇవ్వకూడదు. సింహం మాటలకు అర్థం చెప్పడం అంటే.. కుక్కల అరుపుల్లో లాజిక్ లు చెప్పడం వంటిది అవుతుందని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవన్ బెస్ట్ గా ఉండాలని తను కోరుకొంటున్నాని వర్మ చివరగా చెప్పాడు. మరి పవన్ పిల్లిలా మారిపోయాడన్న ఆర్జీవీ వ్యాఖ్యల పట్ల అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -