Saturday, May 18, 2024
- Advertisement -

ఈ కంపు పోవడం కష్టమేనంటున్న పరిశీలకులు

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నిక్లలో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు. రోజుకో మాట, పూటకో వ్యాఖ్యతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను రాజేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజా వివాదం నుంచి బయటపడడం కష్టమంటున్నారు. ఇంతకీ ఆ వివాదం ఏమిటంటే… అమెరికాలో మాఫియా డాన్ ఫాట్ టోనీ సాలెర్నోతో ట్రంప్ కు సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి.

దీంతో అమెరికన్ ప్రపంచమంతా విస్తుపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ట్రంప్ తన ట్రంప్ టవర్, ట్రంప్ ఫ్లాజాలను నిర్మించడానికి మాఫియా డాన్ ఫోట్ టోనీకి చెందిన కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారట. ఈ కథనాన్ని ప్రఖ్యాత జర్నలిస్టు డేవిడ్ కె జాన్ ఫ్రన్ తన తాజా వ్యాసంలో వెల్లడించారు. పులిట్జర్ అవార్డు గ్రహీత కూడా అయిన జర్నలిస్టు డేవిడ్  అమెరికా నుంచి వెలువడే పొలిటికో అనే పత్రికలో ఈ వ్యాసాన్ని విశ్లేషనాత్మకంగా రాసారు.

అయితే ట్రంప్ కు మాఫియాతో సంబంధాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఈ సారి మాత్రం ట్రంప్ కు, మాఫియా డాన్ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో వివరించే పలు పత్రాలు కూడా పత్రిక ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. మాఫియా డాన్ ఫ్యాట్ టోనీతో తనకు సంబంధాలు లేవని, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాన్ని ప్రచురించిన జర్నలిస్టు జాన్ ఫ్రన్ పై కేసు పెడతానని ఆయన హెచ్చరించారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -