- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసుల‌ను దుమ్మురేపిన హిజ్రాలు..

- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సెల‌బ్రిటీలు ప‌ట్టుబ‌డ‌టం సాధార‌నం అయ్యింది. అయితే ఇప్పుడు హిజ్రాలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డుతున్నారు. తాజాగా మందుకొట్టి కారు నడుపుతూ ఓ హిజ్రా పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కృష్ణా అనే హిజ్రా తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తుండగా…ఆ కారును నిలిపి బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం 99 పాయింట్ల మోతాదుగా రికార్డైంది. దాంతో హిజ్రా కృష్ణపై కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు. దాంతో పక్క సీట్లో ఉన్న మరో హిజ్రా రెచ్చిపోయి వీరంగం సృష్టించింది.

పోలీసుల్ని, మీడియా ప్రతినిధుల్ని దూషించింది. మీడియా ప్రతినిధులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. తోసేయడంతో అదుపుతప్పి కొందరు కిందపడిపోయారు. పరుగెత్తించి.. పరుగెత్తించి మరీ కొట్టారు హిజ్రాలు. కెమెరాలు లాక్కుని నేలకేసి కొట్టారు. కెమెరాను లాక్కుని కిందపడేసింది హిజ్రా..అంతటితో ఆగక హిజ్రాలు తిట్లదండకం అందుకున్నారు. మీ కాపురాలు కూలిపోవాలి..మీరు నాశనమైపోవాలి.. మీకు పిల్లలంతా రోడ్డునపడి అడుక్కుతినాలి.. మీక్కూడా హిజ్రాలు పుట్టాలి అంటూ శాపనార్థాలు పెట్టారు. దాంతో బెంబేలెత్తిపోయిన పోలీసులు అర్థాంతరంగా డ్రంకన్ డ్రైవ్ ను ముగించి అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసులు మెల్లిగా జారుకున్నారు. మీరు కూడా వెళ్లిపోండి వాళ్ల తిట్లు తగుల్తుతాయ్ అంటూ మీడియా ప్రతినిధుల్ని పంపించేశారు ట్రాఫిక్ పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -