Saturday, April 20, 2024
- Advertisement -

పండుగ నాడు డ్రైవర్లు దూరం..!

- Advertisement -

ఐరోపాలో చాలామంది ట్రక్​ డైవర్లు క్రిస్​మస్​ వేడుకలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పండుగ వేళ ఆనందంగా ఇంటి వద్ద గడపాల్సిన వారు.. బ్రిటన్​లో వెలుగు చూసిన కొత్త వైరస్​ కారణంగా సరిహద్దుల వద్దనే ఉండిపోతున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్​తో ఫ్రాన్స్ పాక్షికంగా సరిహద్దులను మూసివేసింది. దీంతో అధికారులు చెక్​పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. కరోనా నెగటివ్​ రిపోర్టుతో మాత్రమే వాహన చోదకులను దేశం లోపలికి అనుమతిస్తున్నారు.

ఈ కారణంగా చాలా మంది డ్రైవర్లు క్రిస్మస్ పండుగకు వెళ్లలేక మాస్ గ్రిడ్‌లాక్‌లో చిక్కుకున్నారు.ఈ విధంగా గ్రిడ్​లాక్​లో చిక్కుకుపోయినవి సుమారు 8వేల నుంచి 10వేలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ట్రక్కులు ఫ్రాన్స్‌లోకి ప్రవేశించడానికి అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. అయితే వీటిని పూర్తిగా పంపాలి అంటే కొద్ది రోజులు సమయం పడుతుందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -