Friday, April 19, 2024
- Advertisement -

తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!

- Advertisement -

ఐరోపా సమాఖ్య(ఈయూ)-బ్రిటన్​ల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు పూర్తయింది. దీంతో బ్రెగ్జిట్​ ప్రక్రియ​ పూర్తయింది. బ్రెగ్జిట్​ గడువుకు(ఈ నెల 31) కొన్ని రోజుల ముందు ఈ ఒప్పందం జరిగింది.

ఒప్పందం పూర్తయిన అనంతరం.. “మేము బ్రెక్సిట్​ పూర్తి చేశాం, స్వతంత్ర వాణిజ్య దేశంగా లభించే అద్భుతమైన అవకాశాలను ఇప్పుడు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటాం.” అని బ్రిటన్​ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈయూతో సున్నా సుంకాలు, సున్నా కోటాల ఆధారంగా తొలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం ఓ అద్భుత పరిణామం. ఇది 668 బిలియన్​ పౌండ్లు విలువ చేసే అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం” అని పేర్కొంది. బ్రిటన్​ తన డబ్బు, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, ఫిషింగ్​ వాటర్స్​పై తిరిగి నియంత్రణ సాధించింది అని పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -