Friday, May 17, 2024
- Advertisement -

ఇటు రూలింగ్.. అటు పాలిటిక్స్

- Advertisement -

కొన్నాళ్లుగా టీడీపీ నేతలే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త చంద్రబాబు నాయుడును చూస్తున్నారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. అటు రాజకీయ నాయకుడిగా ఒకేసారి డబుల్ రోల్ చేస్తూ.. బాబు పార్టీ కేడర్ నే కాదు. జనాన్ని కూడా ఆలోచింపజేస్తున్నారు.

ఇంతకు ముందు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్లు అధికారంలో ఉన్నపుడు పార్టీ కేడర్ కు బాబు దూరంగా ఉన్న విషయం ఇప్పటికీ అంతా గుర్తు చేసుకుంటుంటారు. టీడీపీ కార్యకర్తలైనా సరే.. అప్పట్లో బాబును కలవాలంటే.. అదో పెద్ద ప్రహసనంలా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. కింది స్థాయి కార్యకర్తలను కలిసే విషయంలో పెద్ద మార్పు లేకపోయినా.. పార్టీ పటిష్టత విషయంలో చంద్రబాబు ఆలోచనలు మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నాయి.

రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలుపుతానంటూ.. ప్రభుత్వ పరంగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫ్యూచర్ లో సక్సెస్ అయ్యేదీ కానిదీ పక్కన పెడితే.. పార్టీని 2019లో మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న చర్యలు.. టీడీపీ ప్రత్యర్థులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తో ఆయన దోస్తీ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. టీడీపీ నాయకులను.. ఆఖరికి మంత్రులను కూడా బహిరంగంగా చాలా సార్లు తప్పుబట్టిన పవన్.. ఎక్కడా బాబును టార్గెట్ చేయకపోవడం కూడా ఇద్దరి మధ్య రిలేషన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. రీసెంట్ గా ఇద్దరి మధ్య జరిగిన భేటీ కూడా.. ఫ్యూచర్ పాలిటిక్స్ కోసమే అన్న విషయం క్లియర్ గా తెలిసిపోతోంది.

ఎలాగూ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో వెంకయ్యనాయుడు తప్ప పెద్దగా పొలిటికల్ గ్లామర్ ఉన్న లీడర్ షిప్ లేదు. ఉన్నవాళ్లలో బీజేపీని ముందుండి నడిపించగలిగిన సత్తా కూడా దాదాపు ఎవరికీ లేదు. కాబట్టి ఫ్యూచర్ లో బీజేపీతో ఇబ్బంది వస్తే.. 2014 ఎన్నికల్లో ఉపయోగపడినట్టే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తనకు 2019లో అక్కరకొస్తుందని బాబు అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ ఉండే అవకాశం లేదు. ఇటు వైసీపీ నుంచి ఇప్పటివరకు ఇబ్బంది ఎదురైన పరిస్థితి లేదు. ఈ టెంపోను 2019 వరకు ఇలాగే కంటిన్యూ చేసి.. అవసరమైతే ఆర్నెల్ల ముందే బాబు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని పొలిటికల్ అనలిస్టులు లెక్కలేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -