Friday, May 17, 2024
- Advertisement -

చెర్రీని ఓడిస్తున్న బన్నీ

- Advertisement -

టాలీవుడ్ లో మెగా బావాబామ్మర్దుల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. ఇటు హీరోగా.. అటు ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యేందుకు… మెగా పుత్రుడు రామ్ చరణ్, అల్లు వారసుడు అల్లు అర్జున్.. ఇద్దరూ చేస్తున్న ప్రయత్నాల్లో చెర్రీ ఓ అడుగు వెనక ఉన్న విషయం.. క్లియర్ గా తెలిసిపోతోంది. 

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. గంగోత్రి సినిమాలో హీరోగా నటించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు బన్నీ రేంజ్.. ఒక్కో సినిమాకూ పెరుగుతూ పోతోంది. మినిమమ్ గ్యారెంటీ హీరో అనినించుకున్న దగ్గర్నుంచి మ్యాగ్జిమమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తాడన్న నమ్మకం కలిగించిన బన్నీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విస్తరించుకున్నాడు. టాలీవుడ్ లో మాత్రమే కాక.. కేరళలో ఏ తెలుగు హీరోకూ లేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

తమిళనాడు, కర్ణాటకలోనూ తన సినిమాలు విడుదల చేస్తూ.. అక్కడి హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పుడు.. ప్రొడ్యూసర్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. భలేభలే మగాడివోయ్ సినిమా ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నాడు. తండ్రి అల్లు అరవింద్ గైడ్ లైన్స్ తో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు.

ఇటు రామ్ చరణ్ పరిస్థితి టోటల్ డిఫరెంట్ గా ఉంది. రచ్చ, నాయక్, గోవిందుడు అందరివాడేలే.. ఇలా ఓ మాదిరి హిట్(?) సినిమాలు ఇచ్చినా కూడా మగధీర తర్వాత అంతటి మెగా హిట్ సొంతం చేసుకోలేకపోయాడు. ఇంతలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి  150వ ప్రెస్టేజియస్ సినిమాను తనే ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యాడు. పూరీతో సినిమా అంటూ ట్విటర్ లో అనౌన్స్ చేసినదగ్గర్నుంచి.. చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ వరకూ తెగ హడావిడి చేశాడు. చివరికి.. ఆ సినిమా ప్రస్తుతానికి అటకెక్కింది. ఇదే టైమ్ లో.. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తీసిన బ్రూస్ లీ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇవన్నీ గమనిస్తున్న టాలీవుడ్ అనలిస్టులు, ప్రేక్షకులు మాత్రం.. బన్నీతో పోరులో చెర్రీ ఓడిపోతున్నట్టే అని స్పష్టం చేస్తున్నారు. పక్కా లెక్కలతో అల్లు అర్జున్ ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. అనవసర హడావిడితో చెర్రీ ఉన్న ఆ కాస్త ఇమేజ్ కూడా పోగొట్టుకుంటున్నాడంటున్నారు. ఈ విషయాన్ని చిరు అండ్ చెర్రీ గమనించారో లేదో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -