అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. ఎలా చనిపోయిందనే సందేహాలు లక్షలాది మంది అభిమానుల మనసు తొలచివేస్తోంది. శ్రీదేవి డెత్ మిస్టీపై ఇప్పటి వరకుకూడా క్లారిటీ రాలేదు. అమె మృతిపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు శ్రీదేవి భర్త బోనేపైనే పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు దుబాయ్ పోలీసులు.
యూఏఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంది. దీంతో శ్రీదేవికి గుండెపోటు అని బోనీ కపూర్ ఎందుకు చెప్పారనే దానిపై విచారణ జరుగుతోంది. బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడివుంటే తొలుత స్నేహితుడికి ఫోన్ చేశానని బోనీ కపూర్ పొంతన లేకుండా బదులివ్వడం అనుమానాలకు తావిస్తోంది.
శ్రీదేవి అచేతనంగా పడివుంటే వైద్యులను ఎందుకు పిలిపించలేదని పోలీసులు బోనీ కపూర్ వద్ద విచారణ జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బోనీ కపూర్‌ను పోలీసులు మూడు గంటల పాటు విచారించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది. బోనీ వాంగ్మూలాన్ని వారు రికార్డు చేసుకున్నారని కూడా సదరు మీడియా తెలిపింది. మరోవైపు బోనీ కపూర్ మూడు గంటలపాటు విచారణ చేపట్టిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్ విడిచివెళ్లరాదని బోనీకపూర్‌కు ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపినట్లు సమాచారం.