Friday, May 10, 2024
- Advertisement -

18న వ‌ధువు కానున్న‌యువ క‌లెక్ట‌ర్

- Advertisement -

త్వ‌ర‌లో హైద‌రాబాద్ వివాహ విందు

ప‌రిపాల‌న‌లో కొత్త‌ద‌నం.. చిన్న వ‌య‌సులోనే క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ప‌రిపాల‌న‌లో కొత్త‌ద‌నం దూసుకెళ్తూ అంద‌రి అభిమానం చూర‌గొంటున్న యువ క‌లెక్ట‌ర్ త్వ‌ర‌లోనే పెళ్లి కూతురు కాబోతోంది. త‌న స‌హ‌చ‌ర అధికారినే వివాహ‌మాడ‌నుంది. ఆమెనే తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి. అమ్ర‌పాలి అంటే తెలంగాణ‌లోనే కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా అంద‌రికీ తెలిసిందే. ఆమె వికారాబాద్ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉండి ఎన్నో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి అంద‌రీ ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆమె పెళ్లి గురించి అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆమ్ర‌పాలి పెళ్లి జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రనుంది. 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఆమ్ర‌పాలి ల‌గ్గం చేసుకోనుంది. ఈ పెళ్లి కోసం ఆమ్ర‌పాలి దీర్ఘ‌కాలిక సెల‌వు తీసుకున్నారు. ఈ నెల 18వ తేదీన జమ్మూకాశ్మీర్‌లో ఐపీఎస్ అధికారి, డయ్యూ డామన్ ఎస్పీ సమీర్ శర్మతో ఆమ్రపాలి వివాహం అట్టహాసంగా జరగనుంది అని స‌మాచారం. దీనికోసం అన్నీ ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7వ తేదీ వరకు దీర్ఘ‌కాలిక సెల‌వు తీసుకోనున్నారు. పెళ్లి త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 22 నుంచి 25వ తేదీలోపు హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత 26వ తేదీన భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి హనీమూన్‌ కోసం టర్కీ వెళ్తారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -