- Advertisement -

న్యూజిలాండ్‌ను వరణుడు కాపాడేనా?

- Advertisement -

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విజయానికి అడుగు దూరంలో నిలిచింది. మూడో రోజు ఆటలో వర్షం కారణంగా కేవలం 10 ఓవర్ల లోపు ఆట మాత్రమే సాధ్యమైనప్పటికీ… ఇంగ్లాండ్ బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మూడో రోజు ఉదయం నుంచే వర్షం పడటంతో మొదటి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మధ్యాహ్నం 12:43 గంటలకు ఆట ప్రారంభమైనప్పటికీ కేవలం 11 బంతులు పడిన వెంటనే మళ్లీ వర్షం రావడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 33 నిమిషాలకు ఆట తిరిగి ప్రారంభమైంది.

పిచ్‌పై ఉన్న తేమను, అసమాన బౌన్స్‌ను ఇంగ్లాండ్ పేసర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ లో-బౌన్స్ డెలివరీతో రచిన్ రవీంద్ర (8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ప్రమాదకరమైన బ్యాటర్ డారిల్ మిచెల్‌ను రాబిన్సన్ ఎల్బీడబ్ల్యూ (LBW) రూపంలో డకౌట్ చేశాడు. మరోవైపు ఓపెనర్ డెవాన్ కాన్వే (19 పరుగులతో నాటౌట్) వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో మళ్లీ భారీ వర్షం కురవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. న్యూజిలాండ్ విజయానికి ఇంకా 199 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టు వరణుడిపైనే ఆశలు పెట్టుకుంది.

ఇంగ్లాండ్: మొదటి ఇన్నింగ్స్ 140, రెండో ఇన్నింగ్స్ 226 (ఎమిలియో గే 57, జేమీ స్మిత్ 39..నాథన్ స్మిత్ 6/70).

న్యూజిలాండ్: మొదటి ఇన్నింగ్స్ 113, రెండో ఇన్నింగ్స్ 55/5 (డెవాన్ కాన్వే 19*).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -