మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన తిరుగులేని కలెక్షన్ల దెబ్బ రుచి చూపిస్తున్నాడు. దర్శకుడు బుచిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా వీకెండ్ కాకుండా నార్మల్ వర్కింగ్ డేస్‌లోనే వచ్చినప్పటికీ.. ఊహించని రేంజ్‌లో రికార్డు నంబర్లను రాబడుతుండటం విశేషం. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించి బాక్సాఫీస్ వద్ద మరో భారీ నంబర్‌ను సెట్ చేసింది.
రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ రాంపేజ్ గట్టిగా నడిచింది. డే-2న ప్రపంచవ్యాప్తంగా మరో రూ. 50 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా టోటల్‌గా రూ. 181.8 కోట్ల బ్రహ్మాండమైన గ్రాస్ కలెక్షన్లను అందుకున్నట్లు నిర్మాణ సంస్థ ‘వృద్ధి సినిమాస్’ అధికారికంగా ప్రకటించింది. ఈ వేగం చూస్తుంటే కేవలం మూడు రోజుల్లోనే (ఫస్ట్ వీకెండ్ లోపే) పెద్ది గాడు బాక్సాఫీస్ వద్ద ఈజీగా డబుల్ సెంచరీ (రూ. 200 కోట్లు) మార్కును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా చేసిన మాస్ బ్యాటింగ్.. అటు వెండితెరపైనే కాకుండా ఇటు బాక్సాఫీస్ వద్ద కూడా ఓ రేంజ్‌లో పేలుతోంది.
వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షోకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్ తదితరుల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. కథలోని ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో ‘పెద్ది’ మరిన్ని సరికొత్త రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
