Friday, May 17, 2024
- Advertisement -

కేసీఆర్ ఇలాంటి వాటిని బాబు నుంచి నేర్చుకోవాలి!

- Advertisement -

ఒక్క చిన్న ప్రోగ్రామ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి బొక్క బోర్లా పడింది. ఇజ్రాయెల్ లో జరిగే వ్యవసాయ సదస్సు కు రైతుల రూపంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను పంపే ప్రయత్నం చేసి.. భంగపాటుకు గురవుతోంది. విమర్శలను ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్ వాళ్లు.. ఇటు తెలుగుదేశం వాళ్లు.. కేసీఆర్ ప్రభుత్వంపై ఈ విషయంలో విరుచుకుపడుతున్నారు.

రైతుల పేరుతో ఎమ్మెల్యేలను విదేశాలకు పంపడం ఏమిటనేది వీరి ప్రశ్న. ఇదంతా ప్రజాధనం వృథా చేయడమేనని తెలుగుదేశం నేత ఎర్రబెల్లి విమర్శించాడు. మరి ఇలా విమర్శలను ఎదుర్కొంటున్న కేసీఆర్ అండ్ కో ఈ విషయంలో బాబును ఆదర్శంగా తీసుకోవాలి. అవతల చంద్రబాబు నాయుడు మాటెత్తితే విదేశాలకు విమానం ఎక్కుతున్నాడు.
ఏదో తనొక్కడే కాదు.. తన మందీ మార్బలాన్ని కలుపుకొని బాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళుతున్నారు. ఒక దేశమని కాదు.. ప్రతి దేశానికీ ప్రత్యేక విమానమే. దాని నిండా తన మంత్రులు.. అనుచర ఎంపీలు.. ఇతర నేతలు! అయినా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చాలా తెలివిగా వారిని విదేశాలకు తిప్పుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిలా కాకుండా బాబు ఎవరికీ పట్టుబడటం లేదు. అదేంటి? అంటే.. అధ్యయనం అని సమాధానం చెబుతున్నారు. కనీసం ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేని వాళ్లను బాబు అలా విదేశాలకు తీసుకెళుతున్న తీరును చూసి తెరాస నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -