Thursday, May 2, 2024
- Advertisement -

విరాట్.. ఇక క్రికెట్ నుంచి తప్పుకొంటే మేలేమో!

- Advertisement -

ఒకవైపు గర్ల్ ఫ్రెండ్ ను మెయింటెయిన్ చేసుకోవాలి.. ఇంకోవైపు ఆమె వల్ల వచ్చే విమర్శలకు, వివాదాలకు సమాధానం ఇవ్వాలి. మీడియాతో తగవులు పెట్టుకోవాలి… ఇక జట్టులోని ప్లేయర్లతో కూడా అంత సత్సంబంధాలు లేవు. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కొహ్లీ కి కొత్త బాధ్యతలు వచ్చాయి.

ఆయన ఒక భారీ బిజినెస్ కు రూపకల్పన చేశాడు. దాదాపు వంద కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించనున్నాడు.

దేశ వ్యాప్తంగా విరాట్ జిమ్ , ఫిట్ నెస్ సెంటర్లను నెలకొల్పనున్నాడు. ఒక వ్యాపార సంస్థతో కలిసి ఈ ఇండియన్ క్రికెటర్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతున్నాడు.తొలివిడతలో తొంబై కోట్లు.. తర్వాతి విడతలో మరో వంద కోట్లతో వీరు ఈ వ్యాపారాన్ని విస్తరించనున్నారు. మరి విరాట్ కు ఇప్పటికే ఉన్న బాధ్యతలకు తోడు ఇవి కొత్త బాధ్యతలు అనుకోవాలి!
ఇలా క్రికెటర్లు బిజినెస్ చేయడం కొత్తేమీ కాకపోయినా.. ఇలాంటి బాధ్యతల్లో ఉన్నవారంతా ఆట నుంచి తప్పుకోవడం మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అభిమానుల నుంచి. కోట్ల మంది ఆశలను.. కోట్ల రూపాయల బిజినెస్ లను మోసే వీళ్లు ఏదో ఒక భారాన్ని వదిలించుకొంటే.. రెండో దానికి న్యాయం చేయగలరని.. అభిమానులు అంటున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిద్యం వహించే క్రికెటర్లు చేసే  ఇలాంటి బిజినెస్ లను అభిమానులు సమర్థించే పరిస్థితి లేదు. అందుకే..విరాట్ అయినా.. దోనీ అయినా.. తమ వ్యాపారాలపై దృష్టిసారించేట్లు అయితే.. జాతీయ జట్టు నుంచి తప్పుకోవడం మంచిది అని వారు సూచిస్తున్నారు. మరి క్రికెటర్లకు అభిమానుల ఆవేదన అర్థం అవుతుందా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -