Saturday, April 20, 2024
- Advertisement -

మరో పది మందికి త్వరలో నోటీసులు.. మ‌రింత వేడెక్క‌నున్న టాలీవుడ్ డ్ర‌గ్స్‌వ్య‌వ‌హారం..

- Advertisement -

టాలివుడ్‌తో డ్ర‌గ్స్ మాఫియాకు ఉన్న సంబందాల‌పై ప్ర‌కంప‌న‌లు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.ఇప్ప‌టికే మొద‌టి జాబితాలోఉన్న స్టార్‌ల విచార‌న జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.త్వ‌ర‌లోనె రెండో అంకం మొద‌లు కానుంది.ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్యాప్తులో వెల్లైడైన విష‌యాల ఆదారంగా అధికారులు రెండో జాబితాను సిద్దం చేస్తున్నారు.

రెండో జాబితాకు సంబందించి వ‌చ్చేవారం నోటీసులు జారీ చేసె అవ‌కాశ‌ముంది. నోటీసుల జాబితాలో మ‌రో ప‌దిమంది ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.ఇదే జరిగితే తెలుగు సినీ పరిశ్రమలో మరోమారు కల్లోలం రేగుతుందనడంలో సందేహం లేదు. మత్తుమందులతో పట్టుబడ్డ కెల్విన్‌నుఇచ్చిన స‌మాచారంఆధారంగా విచారించినప్పుడు అధికారులు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఇప్ప‌టికే సిట్‌టై ఆరోప‌నులు వ‌స్తున్నాయి.పెద్ద‌వాల్ల‌ను వ‌దిలి చిన్న వారిపైనె ప్ర‌తాపం చూపిస్తున్నార‌నె ఆరోప‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.కొద్దిరోజులుగా జరుగుతున్న దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా మరికొందరు నటుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

రెండ‌వ జాబితాలో ఈసారి నోటీసులు జారీ చేయబోయే జాబితాలో సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ కుటుంబాలకు చెందిన వారితోపాటు రాజ‌కీయ నాయ‌కుల కుటుంబానికి చెందిన వారు ఉండే అవ‌కాశంఉంది.ఇదే జ‌రిగితే మ‌రింత వేడెక్కే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -