Saturday, May 18, 2024
- Advertisement -

అస్త్రాల‌ను సిద్దం చేసె ప‌నిలో ఇరు పార్టీలు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ఇన్నాల్లు ఒక ఎత్తు…ఇప్పుడు ఇంకో ఎత్తు.ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌వ‌డంతో రంజుగా మార‌నున్నాయి రాజ‌కీయాలు.రెండు పార్టీలు యుద్ధం చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.అయుధాల‌ను సిద్దం చేసుకొనె ప‌నిలో ప‌డ్డారు.ఆగస్టు 23వ తేదీన నంద్యాల ఉపఎన్నిక తేదీని ప్రకటించిన ఎన్నకల కమీషన్ అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 29వ తేదీ ప్రకటించనున్నట్లు చెప్పింది.

భూమా మరణంతో అనివార్యమైన ఉపఎన్నిక ఎన్నికలో గెలుపును టిడిపి, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల జ్వరం దాదాపు పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్ప‌టికే బాబు,లోకేష్ లు నియేజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు.

త‌మ అభ్య‌ర్తిని గెలిపించుకోవ‌డంకోసం బాబు తాయిలాలు ప్ర‌క‌టించ‌డం అధికారంలో ఉన్న పార్టీకి స‌హ‌జం.నోటిఫికేష‌న్ వ‌స్తే హామీలు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌నే ఉద్దేశ్యంతో ముందుగానె వ‌రాల‌జ‌ల్ల‌లు ప్ర‌క‌టించారు.జిల్లా నేతలకు అదనంగా భూమా గెలుపు కోసం చంద్రబాబు డజనుమంది మంత్రులు, 25 మంది ఎంఎల్ఏలు, 5 గురు ఎంఎల్సీలను రంగంలోకి దింపిన సంగతి ని అంద‌రూ చూస్తున్నారు

సీపీ తరపున అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కాకుండా పలువురు ఎంఎల్ఏలు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ ఈనెలాఖరుకు నంద్యాలలో పర్యటించే అవకాశం ఉంది. భారీ ఎత్తున రోడ్డుషో తో పాటు డోర్ టు డోర్ ప్రచారానికి జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.యుద్దంలో ఎవ‌రు పైచేయి సాధిస్తారోచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -