భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. ఇప్పటికే వాయు సేన,నౌకా దళం రంగంలోకి దిగగా తాజాగా ఐఎన్‌ఎస్ విక్రాంత్ కూడా కదన రంగంలో అడుగుపెట్టింది. పాకిస్తాన్ దక్షిణ నగరం కరాచీలో పోర్ట్ సమీపంలో శబ్దవంతమైన పేలుళ్లు వినిపించాయి. ఇదివరకు భారత నౌకాదళంలోని పశ్చిమ నౌకాదళ కమాండ్, అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ అని సమాచారం.
ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం చేపట్టగా పోర్టులో ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో 10 నౌకలు ధ్వంసం అయ్యాయి. ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసం సమీపంలో భారీ పేలుడు సంభవించింది.
అలాగే జమ్మూ కాశ్మీర్‌లో కనీసం 8 క్షిపణులను మరియు రాజస్థాన్‌లోని జైసల్మేర్ వద్ద 30 క్షిపణులను భారత్ తిప్పి కొట్టింది. సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేశారు భారత సైనికులు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు మరియు ఎయిర్‌లైన్లకు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది కేంద్రం. టర్మినల్ బిల్డింగ్‌లలో విజిటర్ ఎంట్రీ నిషేధించారు.
జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కాగా అధికారులకు సెలవులు రద్దు చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. మరోవైపు, సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు ప్రధాని మోదీ.