బిట్‌కాయిన్ బూమ్ నేపథ్యంలో తాము కూడా జియో కాయిన్ పేరుతో ఓ వర్చువల్ కరెన్సీ ప్రవేశపెట్టబోతున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను ఆసరాగా తీసుకుని జియో కాయిన్ పేరుతో కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు పుట్టుకొచ్చాయి. ఈ పేరుతో సెర్చ్ చేస్తే ప్లే స్టోర్‌లో 24కి పైగా యాప్‌లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ జియో లోగోతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో ఉండటంతో వినియోగదారులు సులభంగా మోసపోతున్నారు.
అయితే ఇవన్నీ నకిలీ యాప్‌లు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రిలయన్స్ వారు ఇప్పటివరకు అధికారిక యాప్‌ను విడుదల చేయలేదనే విషయం దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోకుండా ఉండాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనిపిస్తే రేటింగ్స్, కామెంట్లు ఒకసారి పరిశీలించాలని నిపునులు సూచిస్తున్నారు.
అయితే కొన్ని యాప్‌లను ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. వీటిలో కొన్ని యాప్‌లు వైరస్లు కూడా అయిఉండొచ్చు. నకిలీ యాప్‌లపై నియంత్రణలు విధించినట్లు చెబుతున్న గూగుల్‌కి ఈ యాప్‌లు కనిపించలేదా? అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే బిట్‌కాయిన్ యాప్‌లను డైన్లోడ్ చేసుకొనేముందు జాగ్రత వహిస్తే మంచిది.