Thursday, April 25, 2024
- Advertisement -

ఒక సినిమాకు అత్యంత ఎక్కువ లాభాలు తెచ్చుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలిచాడా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ముగ్గురూ కూడా నంబర్ ఒన్ రేసులో చాలా ముందున్న స్టార్ హీరోస్. వీళ్ళతోపాటు ప్రభాస్, బన్నీ, చరణ్‌లు కూడా టాప్ రేంజ్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నవాళ్ళే. సినిమా హిట్‌కి కలెక్షన్సే కొలమానం అయిన కాలంలో నంబర్ ఒన్ హీరో ఎవరు అంటే కూడా రెమ్యూనరేషన్స్ లెక్కలు తీస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ లెక్కల్లోనే అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న తెలుగు హీరోగా ఎన్టీఆర్ నిలిచాడని తెలుస్తోంది. అయితే రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో షేర్ కూడా కలుపుకుంటే ఒక సినిమాకు అత్యంత ఎక్కువ డబ్బులు తీసుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలుస్తున్నాడు.

సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు రెండూ కూడా పవన్ సొంత సినిమాలు అన్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలను కూడా చాలా తక్కువలో చుట్టేసి ఎక్కువ లాభాలు తీసుకున్నాడు పవన్. ఒక్కోదానికి పాతిక కొట్ల వరకూ తీసుకున్నాడు. అయితే రెండు సినిమాలూ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడంతో ప్రాఫిట్స్‌లో షేర్ అన్నమాటే లేకుండా పోయింది. పైగా డిస్ట్రిబ్యూటర్స్‌ని, బయ్యర్స్‌ని బలిచేశాడన్న బ్యాడ్ నేం వచ్చింది. సర్దార్‌ సినిమాకు నష్టపోయిన వాళ్ళు అయితే ఏకంగా నిరాహారదీక్షకు కూర్చోవడం, పవన్ చుట్టూ ఉన్న మాఫియా మమ్మల్ని బెదిరిస్తోందని మీడియా సాక్షిగా వాపోవడంతో పవన్ ఇమేజ్ కూడా బాగానే డ్యామేజ్ అయింది. ఇక మహేష్ బాబు కూడా శ్రీమంతుడు లాంటి సినిమాలకు 20కోట్ల వరకూ తీసుకున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోలను మించి జైలవకుశ సినిమా కోసం దాదాపు 35కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్‌కి కూడా భారీగా లాభాలు వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్‌తో పాటు ప్రాఫిట్స్‌లో భాగం కూడా లెక్కేసి 35కోట్లు ఎన్టీఆర్‌కి ఇచ్చాడట కళ్యాణ్ రామ్. ఆ రకంగా ఎన్టీఆర్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా నిలిచాడు. అన్నింటికీ మించి అప్పుల్లో ఉన్న ఎన్టీఆర్ ఆర్ల్స్ బేనర్‌ని నిలబెట్టడం, కళ్యాణ్ రామ్‌కి సాయపడడం లాంటి విషయాలు కూడా ఎన్టీఆర్‌కి అమితానందాన్ని ఇచ్చి ఉంటాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -