Saturday, May 10, 2025
- Advertisement -

పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బిగ్ షాక్.. పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఎఫ్ఏటీఎఫ్

- Advertisement -

కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా ఒంటరయిన పాక్ కు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. దీంతో పాక్ కోలుకోవడం కష్టమే. ఇప్పటికే అర్థిక మాద్యంతో కుదేలయిన పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింత దారుణంగా తయారవ్వనుంది. పాకిస్థాన్ కు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాక్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు ప్రకటించింది.

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు 11 అంశాలను పాక్‌కు వివరించామని, వాటిలో ఏ ఒక్కటీ ఇమ్రాన్‌ ప్రభుత్వం పాటించలేదని సంస్థ పేర్కొంది.41 మంది సభ్యుల ప్యానెల్ ను పాకిస్థాన్ తన వాదనతో ఒప్పించలేకపోయిందని వెల్లడించింది . మరోవైపు, బ్లిక్ లిస్టు నుంచి తప్పించుకోవడానికి అక్టోబరులోగా పాకిస్థాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అలా చేయలేని పరిస్థితుల్లోలేని పక్షంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. ఆ దేశ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి. గతంలో గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్‌ తాజాగా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడంతో అంతర్జాతీయ పరంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనుంది. పాక్ కు ఆర్థిక సహాయం చేడానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించనున్నాయి. దీంతో పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణస్థితికి చేరుకొంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -