Wednesday, May 15, 2024
- Advertisement -

ఏఆర్ రెహమాన్ పై ఫత్వా జారీ చేసిన ముస్లిం పెద్దలు..!

- Advertisement -

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పై ఫత్వా జారీ అయ్యింది. మతాచారాలకు భిన్నంగా వ్యవహరించే..

తమ మతాన్ని కించపరిచే వారిపై ఫత్వాలను ఇచ్చే ముస్లిం మత పెద్దలు ఇప్పుడు రెహమాన్ విషయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఫత్వాను జారీ చేశారు! రెహమాన్ ముస్లిం మనోభావాలను కించపరిచాడని.. ఆయన వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని.. రెహమాన్ అండ్ కో మహ్మద్ ప్రవక్తను అవమానించిందని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. 

కేవలం ఫత్వాను జారీ చేయడమే కాదు.. ఈ విషయాన్ని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు ముస్లిం మతపెద్దలు. మరి ఇంతకీ మ్యాటరేమిటంటే.. “మహ్మద్ః ది మెసేంజర్ ఆఫ్ గాడ్” ని ఒక సినిమా రూపొందింది. దీన్ని ఒక ఇరానియన్ ఫిల్మ్ మేకర్ రూపొందించాడు. దీనికి ఏఆర్ రెహమాన్ కూడా పనిచేశాడు. వీళ్లంతా కలిసి ప్రవక్తను అవమానించారు.. అనేది ముస్లిం పెద్దల అభియోగం. మరి ఇది ఇంకా విడుదల కాకనే.. అలా ఎలా చెబుతున్నారు? అంటే.. పేరుతోనే ప్రవక్తను అవమానించారని వారు అంటున్నారు.

ప్రవక్త పేరును అలా సినిమా టైటిల్ లో వాడుకోవడం అభ్యంతరకరం.. అని కాబట్టి ఈ సినిమాను నిషేధించాలని వారు కోరుతున్నారు. మరి ఏఆర్ రెహమాన్ కు ప్రవక్త అంటే ఎంత భక్తో వేరే చెప్పనక్కర్లేదు. హిందువు పుట్టిన ఆయన మతం మార్చుకొని ముస్లిం అయ్యాడు. మరి అలాంటి వ్యక్తిపై ఇప్పుడు ఫత్వా జారీ కావడం విశేషం. ఇంతకీ దీనికి రెహమాన్ ఏమని సమాధానం ఇస్తాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -