Friday, May 3, 2024
- Advertisement -

ఉల్లి చేసే మేలు…తెలుసా

- Advertisement -

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత మనకు ఉన్న సంగతి తెలిసిందే. ఇది నూటికి నూరు పాళ్ళు నిజమని అంటున్నారు నిపుణులు.

దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీర కణజాలం దెబ్బతినకుండా కాపాడతాయి. అయితే కొంతమంది ఉల్లిపాయ పై పొరతో పాటు లోపలి పొరను కూడా తీసేస్తూ ఉంటారు. కానీ అలా చేయటం చాలా తప్పని నిపుణులు అంటున్నారు. లోపలి పొరల్లో ఉండే క్వెర్సిటిన్ ఫ్లేవనాయిడ్స్ ఆస్తమా,ఎలర్జీ రాకుండా కాపాడతాయని నిపుణులు చెప్పుతున్నారు. అంతేకాక ఉల్లిపాయను కోసినప్పుడు కళ్ళ నుండి నీరు రావటానికి కూడా ఉల్లిలో ఉండే సల్ఫర్ రసాయనాలే అని చెప్పుతున్నారు. ఉల్లిపాయలో లభించే క్రోమియం అనే మూలకం ఇన్సులిన్ చర్యలను పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుందని అంటున్నారు. అలాగే ఉల్లిపాయకు కొన్ని రకాల క్యాన్సర్ లను నిరోదించే శక్తి కూడా ఉందని కొన్ని పరిశోదనలలో తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -