మీబైక్,కార్‌లో పెట్రోల్ అయిపోయిందా…? ఇప్పుడు అలాంటి ఇబ్బందులపడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తె చాలు మీఇంటికె పెట్రోల్,డీజిల్ వస్తుంది. దీనికోసం కేంద్రం సన్నాహాలు చేస్తోంది. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీది ఆన్‌లైన్‌లోనె బుక్ చేసుకుంటున్నారు. ఇప్పడు తాజాగా కేంద్రం కూడా పెట్రో,డీజిల్‌తో సహా పెట్రో ఉత్పత్తులను ఆన్‌లైన్ లోకితీసుకొచ్చకేందుకు కేంద్రం కసరత్తు ప్రారభించింది.
ప్రపంచాన్ని డిజిటల్ విప్లవం చుట్టేయడంతో అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాబులోకి వచ్చాయి. ఇండియా కూడా డిజిటల్ విప్లవం వైపు పయనిస్తోది. దీనిలో భాగంగా పెట్రోల్, డీజిల్ సహా పెట్రో ఉత్పత్తులను ఈ-కామర్స్ వేదికపై విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటి సాధ్యాసాధ్యాలపై కసరత్తు సాగిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాంపైకి తీసుకువస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు చేశారు.
అయితే మంత్రి ప్రకటనై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. న్‌లైన్‌లో పెట్రో ఉత్పత్తుల విక్రయం అసాధ్యమేమీ కాకున్నా ఈ విషయంలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటించాలని ఈ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు సూచిస్తున్నారు. ఈ-కామర్స్ సైట్లలో పెట్రోల్‌ను ఆఫర్ చేసి ఆ తర్వాత కస్టమర్ల తలుపు తట్టి డెలివరీ చేయడం సాంకేతికంగా సాధ్యమేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఆలోచనను ఇటీవల పార్లమెంటరీ సలహా సంఘం ఎదుట పంచుకున్నారు.
ట్రో ఉత్పత్తులను సరిగ్గా సీల్ చేయడం, సున్నితంగా వాటిని హ్యాండిల్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉందని చమురు, సహజవాయు వ్యవహారాలను పర్యవేక్షించే దీపక్ మహుర్కార్ చెబుతున్నారు. ఇది కార్యరూపం దాల్చే ప్రతిపాదనేనని, భద్రతాపరంగా గట్టి చర్యలు చేపట్టాలని ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ ఆర్‌ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవంతో ఏదైనా సాధ్యమే..