Friday, May 9, 2025
- Advertisement -

ఆర్బీఐకి.. తొలి మహిళా గవర్నర్?

- Advertisement -

ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్న రఘురాం రాజన్ పదవీ కాలం.. త్వరలో పూర్తి కాబోతోంది. అయితే.. రెండోసారి ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగే ఉద్దేశం తనకు లేదని రాజన్ చెప్పడంతో.. ఆయన స్థానంలో కొత్త వారి రాక ఖాయం కానుంది. దీంతో.. రిజర్వ్ బ్యాంకులోనే పని చేస్తున్న కొందరు సీనియర్ ఎకనమిస్ట్ లతో కలిపి.. మొత్తం ఏడుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ లిస్ట్ నుంచి.. ప్రముఖ మహిళ.. ఆర్బీఐకి మొదటి మహిళా గవర్నర్ అయ్యే అవకాశాలున్నట్టు మార్కెట్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

రఘురాం రాజన్ తర్వాత ఆర్బీఐకి 24వ గవర్నర్ అయ్యేందుకు.. ప్రముఖులు పోటీ పడుతున్నారు. అందులో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో పాటు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ అరుంధతీ భట్టాచర్య కూడా ఉన్నారు. వీరితో పాటు.. మరో ఐదుగురు పోటీలో ఉన్నా.. ప్రధానంగా పటేల్, అరుంధతి మధ్యే ఆర్బీఐ గవర్నర్ చైర్ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే రాజన్ పదవీకాలం పూర్తి కావొస్తుండడంతో.. ఈ ఇద్దరిలో ఒకరిని కేంద్రం ఫైనల్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టాప్ మోస్ట్ బ్యాంకుగా తీర్చి దిద్దడంలో విశేష ప్రతిభ చూపిన అరుంధతి.. ఆర్బీఐ గవర్నర్ అయితే.. దేశ ఆర్థిక రంగం కూడా మరింత ముందుకు పోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా అదే అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -